సూపర్ కంప్యూటర్లను మించిన వేగంతో పనిచేసే అత్యాధునిక సికమోర్ చిప్ ను అభివృద్ధి చేసినట్లు గూగుల్ ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ గణించడానికి 10,000 ఏండ్లు పట్టే ఒక గణనను తమ క్వాంటమ్‌ సిస్టమ్‌ సికామోర్‌ కేవలం 200 సెకండ్లలో గణించినట్లు గూగుల్‌ నిపుణుల బృందం వెల్లడించింది. ఇది అసాధారణ విజయమని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విలియమ్‌ ఓలివర్‌ అభివర్ణించారు. 20వ శతాబ్ది ప్రారంభంలో రైట్‌ సోదరులు విమానాన్ని రూపొందించడంతో ఈ విజయాన్ని పోల్చారు.


తాజాగా  ఆవిష్కరణను 'క్వాంటమ్ సుప్రిమసీ' గా అబివరించడం జరిగింది. 'నేచర్' జర్నలో సంబంధిత వివరాలు తెలియచేశారు.  సాధారణ కంప్యూటర్లు బైనరీ సంఖ్యల ఆధారంగా డేటా ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. సికమోర్ చిప్ బైనరీ సంఖ్యలతోపాటు 54-క్యూబిట్స్ తో కూడిన క్వాంటమ్ ప్రాసెసర్ ఆధారంగా అద్భుతంగా పనిచేస్తుంది.  ఈ చిప్ లో ప్రతి క్యూబిట్ మరో నాలుగు క్యూబిట్లతో అనుసంధానమై ఉంటుంది అని తెలిపారు. ఫలితంగా గణన ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతుందని గూగుల్ కృత్రిమ మేధ(ఏఐ) శాస్త్రవేత్త జాన్ మార్టిన్స్ టేకియచేయడం జరిగింది.


ఈ నేపథ్యంలో ఐబీఎం సందేహాలు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గూగుల్ 'క్వాంటమ్ సుప్రిమనీ'కి సంబంధించిన కొన్ని వివరాలు గత నెల్లోనే తెలియడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్న ఐబీఎం సంస్థ సికమోర్ చిప్ పనితీరుపై సందేహాలు తెలియచేశారు. చిప్ పనితీరును మరీ ఎక్కువ చేసి చెప్తున్నారని తెలిపారు. 'సికమోర్ 200 సెకన్లలో చేసే గణనలను సంప్రదాయ ప్రాసెసర్లతో కూడిన కంప్యూటర్లు రెండున్నరేళ్లలో పూర్తిచేయగలవని అభిప్రాయం వ్యక్తం చేసింది.


ఈ సందర్బంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన అభిప్రాయాలు తెలియచేసారు. మా  ఏఐ శాస్త్రవేత్తలు క్వాంటమ్ కంప్యూటర్ ని అబివృది  చేయడం నాకు బాగా గర్వంగా ఉంది అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: