ఒప్పో కంపెనీ ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసిన మొబైల్ ఫోన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మరో మొబైల్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఆ ఫోన్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కాగా, ఈ ఫోన్ విడుదల కాకముందే మొబైల్ ఫీచర్స్ అన్నీ కూడా  లీక్ అయ్యాయి. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..


ఒప్పో ఎఫ్19, ఒప్పో ఎఫ్19 ప్రో, ఒప్పో ఎఫ్19 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు మార్చి 8వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్ లైన్‌లో లీకయ్యాయి. ప్రముఖ టిప్ స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ వివరాలను లీక్ చేశారు. వీటి ప్రకారం ఇందులో అమోఎల్ఈడీ డిస్ ప్లే, వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ను ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో 6.43 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. ముందువైపు హోల్ పంచ్ కటౌట్‌లో 16 సెల్ఫీ కెమెరా ఉండనుంది. మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్  ను అందిస్తున్నారు.


సేల్ఫి ప్రియులకు ఈ ఫోన్ చక్కగా ఉపయోగ పడుతుంది. ఎంత చక్కగా ఫోటోలను తీసుకోవచ్చు..ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పొర్ ట్రెయిట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇంటులో ఉన్నాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు. దీంతోపాటు ఇందులో 4310 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. రిలీజ్ అయితే డిమాండ్ మాములుగా ఉండదు..

మరింత సమాచారం తెలుసుకోండి: