జీవరాశి మనుగడకు మూలాధార వనరు  నీరు. భూమి మీద మూడు వంతుల ప్రదేశాన్ని ఆక్రమించి ఉంది. అయితే ఈ నీరు సూర్యుడి నుంచి భూమి మీదకు వచ్చిందని తాజా పరిశోధనల్లో తేలింది. 2010 జపాన్ కు చెందిన హయాబుసా మిషన్ ద్వారా సేకరించిన పురాతన గ్రహశకలాన్ని  విశ్లేషించిన యూకే, ఆస్ట్రేలియా, అమెరికా పరిశోధకులు నీటి మూలాలను  కనుగొన్నారు. గ్రహాంతర ధూళి  రేణువుల ద్వారా నీరు భూమి మీదకు చేరిందని చెబుతున్నారు. సౌర గాలి అని పిలువబడే సూర్యుడి నుంచి ఛార్జ్ చేయబడిన కణాలు నీటి అణువులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన రసాయన కూర్పు ద్వారా నీరు  ఉత్పత్తి అయిందని తేల్చారు. నేచర్ ఆస్ట్రానమీ జర్నల్లో  అధ్యయన వివరాలు ప్రచురించబడ్డాయి.

 భూమ్మీద నీటిలో కొంత భాగం సి- టైప్  నుంచి వచ్చి ఉండవచ్చని, మరికొంత భాగం సౌర వ్యవస్థలో ఎక్కడైనా ఉద్భవించిన ఐసోటోపికల్ లైట్ సోర్స్ నుంచి వచ్చి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలో గాలి లేని ప్రపంచంపై నీటి వనరుల అన్వేషణకు ఈ పరిశోధన సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడికి దగ్గర కక్ష్యలోని ఎస్- రకం గ్రహశకలంగా పిలవబడే వేరే రకమైన అంతరిక్ష శిల  నుంచి నమూనాలను పరిశీలించడానికి గ్లాస్గో వర్సిటీ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం టోమోగ్రఫీని చేపట్టింది. ఇందుకు సంబంధించిన నమూనాలను ఇటోకావా గ్రహశకలం నుంచి వచ్చాయి. సౌర గాలి ఎక్కువగా హైడ్రోజన్, హీలియం అయాన్ల ప్రవాహాలు. ఇవి సూర్యుడి నుంచి అంతరిక్షంలోకి నిరంతరం ప్రవహిస్తాయి. ఆ హైడ్రోజన్ అయాన్లు ఒక గ్రహ శకలం లేదా అంతరిక్షంలోకి వచ్చే ధూళి కణం వంటి గాలిలేని ఉపరితలాన్ని తాకినప్పుడు, ఉపరితలం కింద భాగాన్ని పదుల  నానోమీటర్ల లోపలికి చొచ్చుకువెళ్తాయి. అవి అక్కడ రాతిపై రసాయన కూర్పును ప్రభావితం చేస్తాయి.

 కాలక్రమేణా హైడ్రోజన్ అయాన్ల  అంతరిక్ష వాతావరణ ప్రభావం, హెచ్2ఓ నీటిని సృష్టించడానికి గ్రహశకలంలోని ఖనిజాలలో చిక్కుకున్న ఆక్సిజన్ అణువులను  బయటికి తీస్తుందని  అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ లూక్ డాలీ  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభ సౌర వ్యవస్థ చాలా ధూళి  ప్రదేశమని,ఇది అంతరిక్షంలోకి వచ్చే ధూళి కణాల ఉపరితలం కింద నీటి ఉత్పత్తికి దోహదం చేసి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడిన భూమికి చేరుకున్న సూక్ష్మ-కణిత  ధూళి ఇక్కడ జలాశయాలకు మూలంకావద్దని ఈ అధ్యయనం గట్టిగా చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: