మల్లన్న సాగర్ ప్రాజెక్టు.. తెలంగాణలో నిర్మితమైన అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంలో ఒక కీలకమైన రిజర్వాయర్.. ఈ మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా రిజర్వాయర్ అంటే ఒకటో, రెండో టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉంటాయి. కానీ మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ మాత్రం ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓ పెద్ద నదిని కృత్రిమంగా ఏర్పాటు చేసినట్టే భావించాలి.


ఈ మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ ను సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్‌ గ్రామం వద్ద నిర్మించారు. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ లో ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది పంపులు ఉన్నాయి. వీటి నుంచి రోజూ 0.85 టీఎంసీ నీటిని మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ దిగువన ఉన్న రిజర్వాయర్లు, కాలువలకు నీటిని ఇవ్వడానికి మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు చేయనున్నారు.


మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ కోసం కనిష్ఠంగా 15 మీటర్ల ఎత్తుతో, గరిష్ఠంగా 60 మీటర్ల ఎత్తుతో 22.6 కి.మీ. దూరం మట్టికట్ట కట్టారు. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ 59 చదరపు కి.మీ. దూరం రిజర్వాయర్‌లో నీరు నిల్వ ఉంటుంది. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 10.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా మొత్తం 12 లక్షల ఆయకట్టుకు నీరు అందుతుంది.


మల్లన్నసాగర్‌ నుంచి తెలంగాణలోని సగం జిల్లాలకు నీరు అందుతుందని మంత్రులు చెబుతున్నారు. ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం ఏకంగా 17, 872 ఎకరాల భూమి సేకరిస్తారు. ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం 15 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని వినియోగించారు. అలాగే మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం 16 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని ఉపయోగించారు. 3 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వాడారు. ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ లో దాదాపు 8 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. మరో నాలుగు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఈ మల్లన్న సాగర్‌ను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: