ఇక్కడ కొంతమంది చేసిన ఆలోచన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు అటువైపుగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏం చేశారంటే.. వారి దగ్గర ఒక లారీ ఉంది. ఈ లారీ తో ఏం చేయగలమా అని ఆలోచించారు. ఈ క్రమంలోనే కాస్త కొత్తగా థింక్ చేశారు. దీంతో లారీని ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చేశారు ఇద్దరు వ్యక్తులు. ఇది ఎక్కడో కాదండోయ్ ఏపీలోని జగ్గయ్యపేట లో జరిగింది. జగ్గయ్యపేట కు చెందిన శివ అతని స్నేహితుడు యశ్వంత్ పాత లారీ కొనుగోలు చేసి దాని రూపురేఖలు మార్చేశారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి హోటల్ గా మార్చారు.
అది కూడా సాదాసీదా హోటల్ గా కాదండోయ్ ఏకంగా ఫైవ్ స్టార్ హోటల్ గా మర్చి.. ఇక హైదరాబాద్ విజయవాడ రహదారిపై తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండల పరిధిలోని క్రాస్ రోడ్డు లో దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం టిఫిన్ ఫాస్ట్ ఫుడ్ తో పాటు పలు రకాల టీలు కాఫీలు కూడా ఈ హోటల్లో దొరుకుతున్నాయి. ఇక త్వరలోనే రెస్టారెంట్ తరహాలో రూపొందించి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందిస్తామని చెబుతున్నారు ఈ ఇద్దరు యువకులు. అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులందరూ వాహనాలు నిలిపి ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాస్త సమయం ఉంటే అక్కడికి వెళ్లి టేస్ట్ రుచి చూస్తున్నారు.ఇక వీరి ఐడియా కి అందరూ ఫిదా అవుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి