ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1,999 రూపాయలకే మనకి అందుబాటులో ఉన్నది. ఇక అంతే కాకుండా ఈ స్మార్ట్ వాచ్ రస్ట్ ప్రూఫ్ జింక్ అల్లామ్ బాడీ తో పాటుగా తేలికగా డిజైన్ చేయబడిందట. ఇందులో IP 68 రేట్ డ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను కూడా అందించారు. ఇక ఇందులో ఫ్యూచర్ విషయానికి వస్తే..1.28 అంగుళాల డిస్ప్లే ను కలదు.24X7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో SPO2, పెడోమీటర్, స్లిప్, మరి కొన్ని సూచనలు కూడా కలవు.స్పోర్ట్స్ నోటిఫికేషన్స్, అలారమ్, వెదర్ వంటివి చూపిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా ఇందులో మరికొన్ని హిస్టరీకి సంబంధించి రికార్డు చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకం ఏమిటంటే వాయిస్ అసిస్టెంట్ ఫ్యూచర్ ని కూడా అందిస్తుంది. ఇక బ్లూటూత్ ద్వారానే మొబైల్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు ఒక వారం రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో సామాన్యులు సైతం కొనే విధంగా పలు టెక్నాలజీ వస్తువులు వస్తూనే ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి