ఈ మధ్యకాలంలో వాహనదారులు ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల పైన మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడంతో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు డిమాండ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూ ఉండడంతో ఆయా కంపెనీలు కూడా సరికొత్త మోడల్స్ మార్కెట్ లోకి విడుదల చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు క్రేజ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు.



ఇదంతా ఇలా ఉండక ఇండియాలో మొదటిసారిగా గేర్లతో కూడిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ రాబోతోంది. టెక్నాలజీ స్టార్ట్ కంపెనీ మేటర్ గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించింది. అహ్మదాబాద్ లోని కంపెనీ ఫ్యాక్టరీలో ఈ బైక్ లను ఉత్పత్తి చేస్తోంది.ఈ క్రమంలోనే మొదటి ఎలక్ట్రిక్ గేర్ బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ తో కూడిన ఈ ఎలక్ట్రిక్ బైక్ "మ్యాటర్ " అనే కంపెనీ తీసుకురాబోతున్నది ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే..


ఏడు అంగుళాల టచ్ ఎల్ఈడి డిస్ప్లే తో పాటు వెహికల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఉండబోతోంది.ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ తో  మొబైల్ ద్వారా కూడా ఈ బైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా స్పీడ్ గేర్ పొజిషన్ రైడింగ్ మోడ్ నావిగేషన్ తదితర టెక్నాలజీబైక్ లో కలదు. ఈ బైక్ ఇండియాలోనే మొదటి ఎలక్ట్రిక్ గేర్ బైక్ గా ఉండనుంది. ఈ బైక్ బ్యాటరీ 5 గంటలలో ఫుల్ చార్జ్ అవుతుంది ఈ బైక్ ఛార్జింగ్ మన ఇళ్లలో కూడా పెట్టుకుని సదుపాయం కలదు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్లు నుంచి 150 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందట. వచ్చే ఏడాది మొదట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ని బుకింగ్ చేసుకుని సదుపాయం కల్పించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: