ప్రముఖ టెక్ దిగ్గజం అయిన షావోమీ చైనాకు చెందిన మొబైల్ సంస్థ అని అందరికీ తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే రెడ్ మీ నోట్ 12 సిరీస్ లో మూడు స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేసింది. ఇందులో రెడ్మి నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి ఇది మనకు మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పై భారీగా తగ్గింపు ధరలు లభిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని షావోమీ ఇండియా తాజాగా తన అధికారిక వెబ్సైట్లో తక్కువ ధరకు లభిస్తోంది అంటూ ప్రకటించింది. ఇక ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.4 వేల తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా సొంతం చేసుకోవచ్చు.

రెడ్ మీ నోట్ 12 ప్రో 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 ఉండగా.. 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999 కాగా అలాగే 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.36,999. అయితే ఇప్పుడు ధరలు కాస్త తగ్గడంతో వీటి ధరలు పూర్తిగా మారిపోయాయి ఇక తగ్గిన ధరలను మనం గమనించినట్లయితే...6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 ఉండగా.. 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా అలాగే 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.32,999.

6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్కార్ట్ లో 14వ శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ.23, 999కే సొంతం చేసుకోవచ్చు. ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ , అలాగే ఎక్స్చేంజ్ చేస్తే రూ.4000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: