ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ బ్రాండెడ్ కు ఎంత క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు..చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్ ని ఉపయోగించాలని ఆసక్తిగా ఉంటారు. అయితే ధరల వల్ల చాలా మంది వీటిని కొనడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు.యాపిల్ సంస్థ ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్ ని లాంచ్ చేయడం జరిగింది. మరో 20 రోజుల్లో ఈ సిరీస్ అందరికీ అందుబాటులోకి రాబోతుంది. ఈ నేపద్యంలోనే ఐఫోన్ 12 మొబైల్ డెడ్ చీప్ గా అందుబాటులోకి రాబోతోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఫ్లిప్ కార్ట్.. రూ.20000 వేల లోపు యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేసేందుకు ఒక సువర్ణ అవకాశం యూజర్స్ కి అందిస్తోంది. యాపిల్ -12..64GB కలిగిన మొబైల్ అసలు ధర రూ.59,900 రూపాయలు ఉన్నది. అయితే ఫ్లిప్ కార్ట్ లో 16% తగ్గింపుతో ఈ మొబైల్ రూ.49,999 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. hdfc బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 2000 తగ్గింపు వస్తుంది. అయితే ఐఫోన్ 12 పైన ఎక్స్చేంజింగ్ ఆఫర్ కింద మొబైల్ పై రూ.30,600 రూపాయలు తగ్గుతుందట.


దీంతో ఐఫోన్ 12 మొబైల్ రూ.17,399 రూపాయలకే మనం తీసుకోవచ్చు. అయితే పూర్తి ఎక్సేంజ్ కావాలి అంటే మీ స్మార్ట్ మొబైల్ మంచి కండిషన్లో ఉండాలి అంతేకాకుండా మొబైల్ అనేది ఎటువంటి డామేజ్ కాకుండా ఉండాలి. ఐఫోన్ 15 ని ఇటీవలే ప్రారంభించిన యాపిల్ సంస్థ ఐఫోన్ 12 తో పాటు,13 మిని మొబైల్స్ ఉత్పత్తిని కూడా నిలిపివేయడం జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన అధికారిక స్టోర్ నుంచి కూడా ఈ రెండు మొబైల్స్ ను సైతం తొలగించినట్లుగా తెలుస్తోంది. మరి ఎవరైతే ఐఫోన్ మొబైల్ ని ఉపయోగించుకోవాలనుకునేవారు ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: