ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగం చాలా కామన్ గా మారిపోయింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక మొబైల్ ని ఉపయోగిస్తూ ఉన్నారు.. అప్పట్లో కేవలం కొంతమంది దగ్గర మాత్రమే ఈ మొబైల్స్ ఉండేవి.. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కో మొబైల్ ఉండనే ఉంటోంది. పూర్వపు రోజుల్లో ఎక్కువగా ల్యాండ్ లైన్ ఫోన్ లే ఉండేవి.. ముఖ్యంగా bsnl ల్యాండ్ లైన్ ఫోన్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి..ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక్కసారిగా జియో నెట్వర్క్ మొబైల్ సిస్టం నే మార్చేసింది.


ఎప్పుడైతే జియో నెట్వర్క్ మార్కెట్లోకి అడుగు పెట్టిందో అప్పటినుంచి ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోవడంతో పాటు ఫ్రీ అనే ఆప్షన్ ని కూడా ఉంచడంతో జియో మొబైల్స్ జియో వాడడానికి ఎక్కువగా ప్రిపరేషన్ ఇస్తున్నారు ప్రజలు. దీని ద్వారా మొబైల్ ఫోన్స్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.. మొబైల్ ఫోన్స్ వాడడం కామన్ గా అయినప్పటికీ ప్రతి మొబైల్ కి కూడా అనేక ఫీచర్స్ ఉంటాయన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..


అయితే స్మార్ట్ మొబైల్ లో ఒక చిన్న రంద్రం ఉంటుంది.. వాటి వల్ల ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం.. పైన చూపించిన మొబైల్ కి ఉన్న ఈ రంద్రం నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్..ఇది మనం ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం ఫోన్ కాల్ లో ఉన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దీనివల్ల డిస్టర్బ్ లేకుండా అవతలి వారికి మన మాటలు వినపడ్చేలా చేస్తుంది.. కేవలం మన వాయిస్ ని స్పష్టంగా అవతలి వారికి వినిపించడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ ఈ రంద్రం మొబైల్స్ కు లేకపోతే మనం మాట్లాడే మాటల కన్నా మన చుట్టూ ఉండే శబ్దాలు ఎక్కువగా వినిపిస్తాయి. అందుకే ఈ రంధ్రం దగ్గర ఎవరు చెయ్యి పెట్టి మాట్లాడకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: