గాంధీయ సామాజిక కార్యకర్త, స్వతంత్ర సమరయోధురాలు అయిన శకుంతల చౌదరి ఈ రోజున కన్నుమూయడం జరిగింది.. అస్సాంలోని ఆమె గ్రామంలో ప్రజల బాగోగులను, మహిళల కోసం, పిల్లల కోసం ఎంతో కృషి చేసింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును కూడా ఆమె అందుకున్నది. ఇక ఈమె మృతికి నరేంద్రమోడీ తన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేయడం జరిగింది.


గాంధీయ విలువలను పెంపొందించడానికి శకుంతల చౌదరి తన జీవిత పర్యంతము కృషి చేసిందని.. అంతే కాకుండా ఆమె ఎప్పటికీ గుర్తుండిపోయే స్త్రీ అని తెలియజేశాడు నరేంద్ర మోడీ. శరణ్య ఆశ్రమం వద్ద ఆమె చేసిన గొప్ప పనులు చాలా మంది జీవితాలను మార్చాయని.. కానీ ఇప్పుడు ఆమె మరణంతో అందరూ బాధాకరం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది పద్మశ్రీ అవార్డును కూడా ఆమెకు ప్రకటించడం జరిగింది. ఇక ఈ పద్మశ్రీ అవార్డు ఈశాన్య ప్రాంతానికి చెందిన నలుగురు మహిళల కి రావడం జరిగింది.. అందులో శకుంతల చౌదరి కూడా ఒకరు. ఈమె అస్సాం ప్రాంతానికి చెందినది. ఈమెను అక్కడి వారంతా శకుంతలా బాయ్ దేవ్. అని పిలుస్తారట.


శకుంతలా చౌదరి గౌహతి లోని ఉండే ఒక కస్తూరి ఆశ్రమంలో పర్యవేక్షకులుగా ఉండేదట. శకుంతలా చౌదరి హండిక్ బాలికల కాలేజీలో మొదటి విద్యార్థి ఈమె. ఇక శకుంతల చౌదరి తన 100 వ పుట్టిన రోజును కస్తూర్బా గాంధీ ట్రస్టుల కాలేజీ విద్యార్థులతో కలిసి ఈమె ఘనంగా జరుపుకుంది. ఇక ఓక నివేదిక ప్రకారం శకుంతలా చౌదరి 100 సంవత్సరాలు దాటిన ఏకైక మహిళగా గుర్తింపు పొందింది. సామాజిక కార్యకర్త శకుంతలాదేవి.. ఆలోచనలు మహాత్మా గాంధీ ఆలోచనలు ఒకేలా ఉండేవని అందుచేతనే వీరిద్దరూ కలిసి ఎన్నో సూత్రాలను ముందుకు తీసుకెళ్లాలని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: