కరోనా ఏమని వచ్చిందో కానీ అప్పటి నుండి రకరకాల వేరియంట్లు , కొత్త వైరస్ లు మనల్ని భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి.
ఇంకా కరోనా మహమ్మారి ఈ నేలను వీడి పూర్తిగా వెళ్ళనే లేదు.

ఇపుడు మరో కొత్త వైరస్ ఒకటి ఉనికిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అంతా ఆందోళన చెందుతున్నారు. వివరాల్లో కి వెళ్ళగా....అమెరికాలో ఓ కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది అని సమాచారం. ప్రస్తుతం అగ్రరాజ్యంలో హార్ట్ ల్యాండ్ వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. ఇప్పటికే  పలువురు ఈ వైరస్ భారిన పడినట్లు సమాచారం. నల్లుల నుండి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని అని అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో అమెరికన్ సిటిజన్స్ కలవరపడుతున్నారు. ఇప్పటికే జార్జియా సహా 5 రాష్ట్రాలలో కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకితే శరీరం పై దే నీ ప్రభావం తీవ్రంగా ఉంటోందట. తద్వారా శరీరం లోని అవయవాలు పనితీరు తగ్గుతుందని క్రమంగా పనిచేయడం ఆగిపోతాయి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ కి ఇంకా చికిత్స అందుబాటులో లేక పోవడం మరో దురదృష్టకర అంశం.  ఈ వైరస్ సోకితే చికిత్స లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో జ్వరం, కీళ్ళ నొప్పులు,తలనొప్పి డయేరియా   వంటి లక్షణాలు కనిపిస్తాయి వైద్యులు తెలిపారు. అయితే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందా...ఒకరి నుండి మరొకరికి ఎలా సోకుతుంది...తదితర వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


ఇప్పటికే చైనా , దక్షిణ కొరియా వంటి దేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది అన్న వార్తలు ప్రజల్ని సతమతం చేస్తుంటే ....ఇపుడే కొత్త వైరస్ మరో కొత్త భయాన్ని, ఆందోళన నీ తీసుకొచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: