
ముఖ్యంగా నేటి రోజుల్లో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలా ప్రపంచంలో దాగి ఉన్న వింతలకు సంబంధించిన విషయాలను ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పాలి. సముద్ర గర్భంలో ఎన్నో వింతైన జీవులు దాగి ఉన్నాయి అన్నదానికి నిదర్శనంగా కొన్ని కొన్ని సార్లు కొన్ని వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలా వీడియోలలో ఎక్కడ వింత జీవి కనిపించింది వెంటనే దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ తల్లిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడూ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటివరకు ప్రతి ఒక్కరు ఎన్నో రకాల వింతైన చేపలను చూసే ఉంటారు.
కానీ ఇప్పుడు చూడబోయేది మాత్రం మీరు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించని కని విని ఎరుగని వింతైన చేప అని చెప్పాలి. అచ్చం చిలక ముక్కను పోలిన తలను కలిగి ఉన్న చేప కు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. కురవి మండలం బురసాల గ్రామ శివారులోని చెరువులో వింత షాపు దొరికింది.. అయితే ఈ చేప తల చిలక ముక్కు మాదిరిగా ఉండడంతో అందరూ ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఇక స్థానికులు ఎగబడి మరి ఈ చేపను చూశారు అని చెప్పాలి.