అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటాయి అనే విషయం తెలిసిందే. అయితే అడవుల్లో ఉండే క్రూరమైన జంతువుల్లో పులులు కూడా ఒకటి. అడవికి రారాజు ఆయన సింహం తర్వాత ఆ రేంజ్ లో బలం కలిగి ఉండేది మాత్రం పులి అని చెబుతూ ఉంటారు అందరూ. అయితే పులి వేటాడటం మొదలు పెట్టింది అంటే చాలు ఎంత భారీ జంతువునైనా సరే ఆహారంగా మార్చుకోగల సత్తా కలిగి ఉంటుంది. ఇక ఎప్పుడూ శత్రువులపై పంజా విసురుతూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది పులి.


 అయితే ఇలా ఎప్పుడూ గంభీరంగా భయంకరంగా కనిపించే పులి కొన్ని కొన్ని సార్లు సరదాగా గడపడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది. ఇక ఏకంగా క్రూర జంతువైన పులిలో కూడా చిన్నపిల్లాడి మనస్తత్వం ఉంటుందా అని ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఒక పులి పిల్ల తల్లిని భయపెట్టేందుకు సరికొత్త ప్లాన్ వేసింది. ఏకంగా తల్లి పులి హాయిగా సేద తీరుతున్న సమయంలో ఏకంగా అక్కడికి ఒక్కసారిగా దూకిన పులి పిల్ల తల్లిని భయపెట్టింది.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా తన తల్లిని ఆటపట్టించేందుకు చిన్న పులి పిల్ల చేసిన పని మాత్రం నెటిజన్స్ అందరికీ కూడా నవ్వు తెప్పిస్తుంది. ఏకంగా ఒక్కసారిగా తల్లి వైపుకు చిన్న పులి పిల్ల దూసుకు రావడంతో తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో తల్లికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఇక ఇది గమనించిన పులి పిల్ల మళ్లీ ఏమి ఎరగనట్లుగానే పక్కకు వెళ్లిపోయింది. ఈ వీడియో చూసి అందరూ కూడా నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: