సముద్రాలలో చాలా రకాల వింతలు, విశేషాలున్నాయి.ఎన్నో వందల చిత్ర విచిత్రమైన జీవులు అక్కడ ఉంటాయి. కొన్నిటిని చూస్తే భయంతో ఎవరికైనా గూస్‌బంప్‌లు ఈజీగా వస్తాయి.ఇక లోతైన సముద్రంలో కనిపించే కొన్ని జీవులు చేపలతో సహా చాలా ప్రమాదకరమైనవి కొన్ని లక్షల్లో ఉన్నాయి. మనం సాధారణంగా చేపలను తింటాం.. అయితే సముద్రపు లోతులలో కనిపించే కొన్ని చేపలు తినడం అసాధ్యం.. అంతే కాదు కనీసం వాటిని చూడడానికి కూడా భయపెట్టేవిలా చాలా భయంకరంగా ఉంటాయి. సముద్ర చేపల్లో  ఒక వింత చేప అయిన సిర్కటి చేపలు చాలా భయంకరంగా ఉంటాయి..అవి కూడా జీవించి ఉన్న చేపని చూస్తే ఒళ్ళు వణుకు పుడుతుంది. ఇక ప్రస్తుతం అలాంటి చేపకు చెందిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చేపను చూస్తే ఎవరికైనా సరే ఖచ్చితంగా ఒళ్ళు జలదరిస్తుంది.. కళ్ళు ఎగిరిపోతాయి.చాలా భయంకరంగా కనిపిస్తున్న ఈ చేప పేరు సిర్కటి చేప. 


ఈ వైరల్ వీడియోలో.. తెగిపడిన తలతో ఉన్న ఈ పెద్ద చేప కనిపిస్తుంది. ఈ తల తప్ప శరీరం లేని చేప పెద్ద నోరు తెరిచినట్లు మనం చూడవచ్చు. ఇక దానిని చూస్తుంటే అది చనిపోయినట్లు అనిపిస్తుంది ఎవరికైనా.. ఎందుకంటే ఆ చేప తల ను శరీరంని రెంటిని వేరు చేశారు.. అందువల్ల ఆ చేప చనిపోయిందని అందరూ భావిస్తారు. కానీ ఈ వీడియోలో ఒక వ్యక్తి చేప నోటిలో కోక్ డబ్బాను ఉంచడానికి ప్రయత్నించాడు.. అయితే అకస్మాత్తుగా ఆ చేప ఆ కోక్ డబ్బాను వెంటనే పట్టుకుంది. ఆ డబ్బాను గట్టిగా తన నోటితో పట్టుకోవడంతో దెబ్బకు ఆ డబ్బా కూడా నలిగిపోయింది. ఇంకా అంతేకాదు ఆ డబ్బానుంచి డ్రింక్ కూడా బయటకు వచ్చింది. ఈ విజువల్స్ చూసిన వారికి ఖచ్చితంగా భయంతో వణుకు పుట్టడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: