
వధూవరులు తమ పెళ్లి వేడుక ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా ఇక మండపం లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తమకు ఇష్టమైన పాటపై డాన్సులు చేయడం చేస్తున్నారు. ఇక ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి. అయితే కేవలం వధూవరులు మాత్రమే కాకుండా బంధువులు కూడా తమాషా చేస్తూ వధూవరులను ఆటపట్టించడం లాంటి వీడియోలు కూడా చాలానే ఇంటర్నెట్ లో వెలుగులోకి వచ్చాయి ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి ఇంస్టాగ్రామ్ లో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. పెళ్లి మండపంలోకి వస్తున్న వరుడుకి వధువు ఎదురుపడింది. ఇక వధువును చూడగానే హీరోలాగా ఫీల్ అయ్యాడు వరుడు.
ఈ క్రమంలోనే రొమాంటిక్ పాటపై డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇక వరుడు డాన్స్ కి అటు వధువు ఫిదా అయిపోయింది అన్నది ఈ వీడియోలో చూడవచ్చు. వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే.. వరుడు పెళ్లి కోసం ఊరేగింపుతో వివాహ వేదిక వద్దకు చేరుకోవడం కనిపిస్తుంది. అయితే వధువును చూడగానే తనను తాను మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు వరుడు. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ రొమాంటిక్ డాన్స్ చేస్తూ పెళ్లి కూతురికి ఎర్ర గులాబీ ని అందించాడు. దీంతో అతని డాన్స్ చూసి వధువు మాత్రమే కాదు అక్కడున్న వారందరూ కూడా అవాక్కయ్యారు అని చెప్పాలి.