సాధారణంగా ఈ భూమి మీద ఉండే కొన్ని జంతువుల మధ్య పుట్టుకతోనే వైరం కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా పుట్టుకతో జాతి వైరం కొనసాగే జంతువులలో కుక్క పిల్లి కూడా ఉంటాయి అని చెప్పాలి. ఈ రెండు జంతువులు ఎదురుపడ్డాయి అంటే చాలు బలం కలిగిన కుక్క ఏకంగా పిల్లిని చంపేయాలి అన్నంత కోపంతో దాడికి పాల్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. అంతేకాదు భయంతో పిల్లి కుక్క నుంచి తప్పించుకోవడం చేస్తూ ఉంటుంది. ఇది కేవలం వార్తల్లో వినడం మాత్రమే కాదు ఎంతోమంది డైరెక్ట్ గా కూడా చూసే ఉంటారు.



 అయితే ఇటీవల కాలంలో జాతి వైరం కలిగిన ఇలాంటి జంతువులు కూడా ఏకంగా స్నేహభావంతో మెలుగుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ రెండు కూడా ప్రస్తుతం పెంపుడు జంతువులుగా మారిపోవడంతో ఎంతోమంది కుక్క పిళ్లిని తెచ్చుకుని ఒకే దగ్గర పెంచుకుంటున్నారు. దీంతో జాతి వైరాన్ని మరిచిపోయి ఇక పిల్లి కుక్క స్నేహితులుగా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండటం లాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇదే జరిగింది. కుక్క, పిల్లి ఎంతో స్నేహంగా ఉన్నాయి. కానీ పిల్లి తాను పిల్లిని అన్న విషయాన్ని మరిచిపోయింది.


 కుక్కతో సహవాసం చేసి కుక్కలాగే మారిపోయింది ఆ పిల్లి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నెటిజెన్స్ అందరు కూడా నవ్వుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. సాధారణంగా పిల్లి మ్యావ్ అని అరుస్తూ ఉంటుంది. కుక్కలు బౌ బౌ అని అరుస్తాయి. అలాగే కుక్కలు ఎప్పుడూ తమ నాలుకను బయటకు పెట్టి ఊపిరి పీల్చుకోవడం లాంటిది కూడా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక పిల్లి తనను తాను మరిచిపోయి కుక్కల నాలుక బయటపెట్టి ఆడిస్తుంది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: