గడిచిన వారం రోజుల నుండి ఎక్కువగా ఉదయం పూట ఎండ రాత్రి సమయాలలో వర్షం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అకాల వర్షం రావడంతో రైతులకు పంటలు నాశనం చేస్తూ బీభత్సవం సృష్టిస్తోంది. అయితే ఈ వానలు ఇప్పట్లో ఆగేలా లేవని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తుంది.. విదర్భ నుంచి ఉత్తరత మిలనాడు మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఈ దూరని కొనసాగుతుందని తెలియజేస్తోంది. రానున్న 24 గంటలలో కోస్తా రాయలసీమలో ఒక మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.


పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే దక్షిణ కోస్తా వైపు మృత్యుకారులు వేటకు వెళ్లకూడదని రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , యానాం ప్రాంతాలలో బుధు, గురువారాలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే వర్షంతో ఈదురుగాలులతో గంటకు 40-50 k.m వేగంతో వర్షం పడే అవకాశం ఉంటుందట.


దక్షిణ కోస్తాలు ఈరోజు రేపు ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నది. ఇక అక్కడక్కడ కొన్నిచోట్ల శుక్రవారం రోజున ఒక మోస్తారు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రాయలసీమలోని పలు జిల్లాలలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈదురు గాలులతో గంటకు 40-50 k.m వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక శుక్రవారం రోజున తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తోపాటు కొన్నిచోట్ల ఉరుములు జల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నది. దీంతో వాతావరణ శాఖ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: