నగరంలో సగటు జీవి బ్రతుకు సగమే అనిపిస్తుంది.. ఎందుకంటే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఇక్కడే చోటు చేసుకుంటున్నాయి కాబట్టి.. ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా ఇళ్లు చేరుకుంటారనే నమ్మకం అసలేదు.. అదెలా అంటే ఈ హైదరాబాదు, హైఫై బాదలను రుచి చూపిస్తుంది.. మృత్యువు అన్ని దార్లో నుండి ముంచుకొస్తుంది.. ఇక మనం చూడబోయే వీడియోలో ఒక ట్రాక్టర్ భయంకరమైన భీభత్సాన్ని సృష్టించింది.. అదృష్టవశాత్తు ఆ కాలనీలో జనంలేరు కాబట్టి ప్రాణనష్టం జరుగలేదు కానీ ఒకవేళ ఎవరైనా ఉంటే మాత్రం వారి ప్రాణాలు గాల్లో కలిసేవి.. ఈ దారుణ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే..

 

 

హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని గణేష్‌పురి కాలనీలో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. కాలనీలోని  రోడ్డు మీదుగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే నిలిపి ఉంచిన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఇక అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగకపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రాక్టర్ అదుపుతప్పి అక్కడున్న వాహనాలను ఢీకొడుతూ వస్తున్న సమయంలో ఓ చిన్న పిల్లాడు రోడ్డుపైకి వచ్చి వేగంగా విధ్వంసాన్ని సృష్టించుకుంటు వస్తున్న ట్రాక్టర్‌ను చూసి భయంతో ఇంటిలోపలికి పరిగెత్తడంతో ఆ బాలుడు బ్రతికిపోయాడు.. లేదంటే ఆ ట్రాక్టర్ కింద నలిగిపోయే వాడు..

 

 

నిజానికి ఆ బుడతడు పిల్లవాడైనా చురుగ్గా స్పందించాడు.. ఇకపోతే భవన నిర్మాణ వ్యర్థాలతో వెళ్తున్న ఆ ట్రాక్టర్ డ్రైవర్ కి ఏమయిందో ఏమో కానీ రోడ్డుపై నిలిపి ఉన్న కారు, బైక్‌ను ఢీకొట్టగా ఆ కుదుపులకు అమాంతం ఎగిరి రోడ్డు పక్కనున్న ఇంటి సమీపంలో పడ్డాడు. మరో వ్యక్తి ట్రాక్టర్‌పైనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండిపోయాడు. ఇలా కొంతదూరం వరకు దూసుకెళ్లిన ట్రాక్టర్‌… సమీపంలోని మరో కారుకు తట్టుకొని నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ గాయపడగా.. 2 కార్లు, 5 బైకులు ధ్వంసమయ్యాయట.

 

 

ఇక డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. అక్కడి స్దానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా, వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్మాప్తు ప్రారంభించారు.. ఇక అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయినా ఈ సంఘటన తాలూకు దృష్యాలు చూస్తేనే ఒంట్లో భయం పుడుతుంది.. ఆ సమయంలో ఆ కాలనీవైపు రాని వారంత అదృష్టవంతులని చెప్పవచ్చూ.. ఒక వేళ ఎవరైన బయట ఉండి ఉంటే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది.. అందుకే బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తే గాని తిరిగి ఇంటికి చేరుకోలేము.. అది ఈనాటి నగర ప్రజల దుస్దితి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: