కామన్‌గా మనుషులు ఒక వయస్సు వచ్చాక తమ పటుత్వాన్ని కోల్పోయి బలహీన పడతారు.. అందులో ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాలు దాటితే చాలు అన్ని రోగాలు మనిషిని చుట్టుముట్టుతున్నాయి.. ఇక 50 దాటితే అసలే చాత కాక ఉంటున్నారు.. ఇవన్ని ఈ కాలంలో మనం తీసుకునే ఆహారపదార్దాల వల్ల సంభవిస్తున్న రోగాలు.. ఇదంత పక్కన పెడితే వయస్సు ఏదైనా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అనారోగ్యం దరిచేరదని నిరూపిస్తుంది ఒక బామ్మ.. తన 73 ఏళ్ల వయస్సులో అంటే శక్తి కోల్పయిన స్ధితిలో మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేసే వయస్సులో ప్రతి వారిని షాక్‌కు గురిచేస్తుందనే చెప్పాలి. ఆ వివరాలు తెలుసుకుంటే.

 

 

కెనడాలోని ఒంటెరియాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు జాన్‌ మెక్‌డొనాల్డ్‌ కండలు తీరిన దేహంతో ఔరా అనిపిస్తున్నారు. ఏ సోది చెబుతున్నారు 73 ఏళ్ల వయస్సులో అందులో ఒక మహిళ కండలు తిరిగిన దేహంతో ఉండటం ఎలా సధ్యం అని అనుమానపడకండి.. అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకోండి.. ఈ మహిళ ఒకప్పుడు అందరిలాగే అధిక బరువుతో, హైబీపీ, కొలెస్ర్టాల్‌, యాసిడ్‌ రిఫ్లక్స్‌ వంటి సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకునేవారు. ఆ సమయంలో 198 పౌండ్ల బరువుండే జాన్‌ మెక్‌డొనాల్డ్‌ నిత్యం కసరత్తులు, వ్యాయామాలతో ఏకంగా 50 పౌండ్లు తగ్గి కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నారు.

 

 

బరువులు ఎత్తడంతో పాటు తాను జిమ్‌ చేస్తున్న ఫోటోలతో ఆమె ఫిట్‌నెస్‌పై ఏకంగా ఇన్‌స్టాగ్రాం పేజ్‌ను నిర్వహిస్తున్నారు. తాను సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు అమినో యాసిడ్స్‌, ప్రొటీన్‌ షేక్స్‌ వంటి సప్లిమెంట్స్‌ను తీసుకుంటానని ఆమె చెబుతున్నారు. చూసారా సాధించాలనే పట్టుదల ఉంటే వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఈ బామ్మ... ఇక ఈమె ఇన్‌స్టా పేజీకి ఇప్పుడు 5,00,000 మంది ఫాలోయర్లు ఉండటంతో ఈ సీనియర్‌ బాడీబిల్డర్‌ సోషల్‌ మీడియా సెలబ్రిటీ అయ్యారు. ఆ వీడియో మీరుచూసి ఎంజాయ్ చేయండి.. వయస్సు ముదిరిందని బాధపడకుండా ఇలా ఫిట్‌గా మారడానికి ప్రయత్నించండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: