ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమైన ఫుడ్ ఫాస్ట్ ఫుడ్. ఇప్పుడు ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫాస్ట్ ఫుడ్ ను తినడం అలవాటు నేర్చుకున్నారు. కొందరు అయితే రోజుకు ఒక్కసారైనా బయట ఫుడ్డు తినండి ఉండలేరు. అలా ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ కు ఎడిక్ట్ అయ్యారు. అలాగే యూకే కి చెందిన ఒక వ్యక్తి తన మనవడికి ఇష్టమైన హ్యాపీ మీల్ కొనాలని వెళ్లి రెండు లక్షల పైన్ కట్టాడు. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం.


 మెక్ డొనాల్డ్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పాసుపోర్టు జాయింట్ ఇది. చాలామంది మెక్ డోనాల్డ్స్ లో తినేందుకు ఎంత దూరమైనా పెద్దగా పట్టించుకోరు. అలాగే యూకే కి చెందిన ఓ వ్యక్తి తన మనవడికి ఇష్టమైన మెక్ డొనాల్డ్స్ లో హ్యాపీ మీల్ కొని చ్చేందుకు తీసుకెళ్లాడు. కానీ 2.79 డాలర్ల హ్యాపీ మీల్ కోసం ఆ పెద్ద మనిషి 2000 యూరోలు ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.


 అక్కడే ఉన్న స్థలంలో మనవడు తన స్నేహితుల ఆడుకుంటూ ఉండటంతో కాసేపు అలా నిద్ర పోయాడు. కానీ దీని ఫలితంగా అతడు ఏడు గంటల 15 నిమిషాలు అక్కడే ఉండిపోయాడు. అయితే యూకే లో ఏ ప్రదేశంలో అయినా కారు రెండు గంటల కంటే ఎక్కువ సమయం పార్కింగ్ చేయడం నిషిద్ధం. ఇలా చేసిన వారికి పైన్ విధిస్తారు.. అలాగే బాబ్జెజ్ కి కూడా ఫైన్ వుండించారు హైవ్యూ పార్కింగ్ కి సంబంధించిన వ్యక్తులు. ఈ ఫైన్ ని అతని అడ్రస్ కి పంపించడం జరిగింది. కానీ అడ్రస్ తప్పు కావడంతో  బాబ్జెజ్ కి ఈ విషయం తెలియలేదు. ఇలా గతంలోనూ అతనికి నాలుగు ఫైన్ లు పడిన అవి అతని అడ్రస్ కి రాకపోవడంతో దాని గురించి బాబ్జెజ్ కి సమాచారం అందలేదు.


నాలుగు సార్లు ఫైన్ చెల్లించకపోవడంతో డిసిబిఎల్ కి సంబంధించిన కలెక్షన్ ఏజెంట్ బాబ్జెజ్ ఇంటికి రావడం వారిని షాక్ కు గురి చేసింది. ఫైనల్ గా మొత్తం 400 యూరోలు, వారి రికవరీ ఖర్చుల నిమిత్తం 1651 యూరో లో మొత్తం కలిపి దాదాపు రెండువేల యూరోలు అనగా భారత్ కరెన్సీలో రెండు లక్షల రూపాయలు పైన్ గా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు అయితే మెక్ డోనాల్డ్స్ ఆర్డర్లు ఆహార ప్రేమికులను బందులో పడేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలామంది ఇలా ఇబ్బందులు పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: