ఫోటోలు మనకు ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంగానే మిగిలిపోతాయి. ఆ ఫోటోలను చూడగానే ఆ మధుర జ్ఞాపకాలను తిరిగి మరల ఒకసారి గుర్తు చేసుకుంటాము. ప్రస్తుతం అలాంటి ఒక తీపి జ్ఞాపకాన్ని రామ్ చరణ్ తేజ్ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినరామ్ చరణ్ ఇండస్ట్రీలోకి రాకముందు తన అక్క సుస్మితా పెళ్లి వేడుకలో పాల్గొన్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ సుస్మితా పెళ్లికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో రామ్ చరణ్ తన అక్క పల్లకి మోస్తూ కనిపిస్తున్నాడు.                                           

ఈ ఫోటోలో మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ తో పాటు, దగ్గుబాటి రానా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పల్లకి మోస్తూన్న బోయీలంతా ఇప్పుడు స్టార్ హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోలందరూ కలిసి పల్లకి మోస్తున్నటువంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా ఏడాది డిసెంబర్ లో జరిగిన నిహారిక పెళ్లి సమయంలో కూడా మెగా హీరోలు అందరూ కలిసి ఇదేవిధంగా నిహారికను పల్లకిలో మోస్తూ,ఆటపాటలతో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.అప్పట్లో నిహారిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: