ది సింప్సన్స్ అనే ఒక అమెరికన్ అడల్ట్ యానిమేటెడ్ సిట్‌కామ్ (సిచువేషన్ కామెడీ) టీవీ సిరీస్ డిసెంబర్ 17, 1979వ కాలం నుంచి ప్రసారం అవుతోంది. ఇప్పటికే 32 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ అమెరికన్ సిరీస్ లో మొత్తం 750 వరకు ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సరాసరి నిడివి 23 నిమిషాలు ఉంటుంది. అయితే ఈ టీవీ సిరీస్ అమెరికన్ సంస్కృతి, సమాజం, మానవ పరిస్థితులను సెటైరికల్ గా, పేరడీగా చూపిస్తుంది. అందుకే ఈ టీవీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ సిరీస్ లో చూపించినవి భవిష్యత్తులో జరుగుతుంటాయి. లేడీ గాగా మ్యూజికల్ కన్సర్ట్ లో గాల్లో ఎగరడం, మ్యాజిక్ షోలో పులి దాడి చేయడం, బెంగ్ట్ ఆర్. హోల్మ్‌స్ట్రోమ్ నోబెల్ ప్రైజ్ గెలవడం,  తప్పుడు ఓట్లు పడటం, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ముగింపు, స్మార్ట్ వాచ్ వినియోగం లాంటివెన్నో 20-30 ఏళ్ల క్రితం ప్రసారమైన  ది సింప్సన్స్ ఎపిసోడ్స్ లో ఉన్నాయి.

అయితే తాజాగా బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ (71) చేసిన అంతరిక్ష యాత్ర గురించి కూడా డిసెంబర్ 7, 2008లో ప్రసారమైన ది సింప్సన్స్ సీజన్ 20, ఎపిసోడ్ 8 "ది బర్న్స్ అండ్ ది బీస్" లో చూపించారు. ఈ ఎపిసోడ్ లో ఒక వృద్ధ వ్యక్తి అంతరిక్షంలో సున్నా గురుత్వాకర్షణ శక్తిలో హాయిగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. రిచర్డ్ బ్రాన్సన్ కూడా అదే తరహాలో రాకెట్ షిప్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఇక దీంతో సొంత వ్యోమనౌకలో రోదసీలోకి అడుగుపెట్టిన రిచర్డ్ బ్రాన్సన్ గురించి ది సింప్సన్స్ టీవీ సిరీస్ ముందుగానే ఊహించిందా అని కొందరు ట్విట్టర్ వేదికగా తమ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వర్జిన్ గెలాక్సీ గ్రూప్ ప్రజలను అంతరిక్ష యాత్రలకు తీసుకువెళ్లాలని.. త్వరగా అంతరిక్ష యానానికి అయ్యే టికెట్ ఖర్చులు కూడా ప్రకటించాలని కోరుతున్నారు.



ఆదిత్య కొండవార్ అనే ట్విట్టర్ యూజర్ సింప్సన్స్ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక చిత్రాన్ని షేర్ చేసి “సింప్సన్స్ ప్రతి విషయాన్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది?” అని తోటి నెటిజన్లను ప్రశ్నించారు. మరొక యూజర్.. "సిరీస్ రచయితలు భీభత్సమైన సృజనాత్మకతతో ఆలోచనలు చేశారు. చూపించారు. వారి అద్భుతమైన ఆలోచనలను మనం ఇప్పుడు నిజం చేస్తున్నాము." అని బదులు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: