కానీ కోడి భయమే ఇతనికి మరింత ధైర్యాన్నిచ్చింది. ఆ కోడి చూసి చూసి ఇక ఓర్వలేక ఆ అబ్బాయిపై ఎదురు తిరిగేందుకు సిద్ధమైంది. సరైన సమయం కోసం చూసిన కోడి వెంటనే ఆ అబ్బాయిపై వస్తూ ఉంది. ఈ రియాక్షన్ ను ఊహించని ఆ అబ్బాయి ఒక్క సారిగా భయపడిపోయాడు. ఎక్కడ తనను గాయ పరుస్తుందో అని పారిపోవాలని చూశాడు. కానీ అక్కడ ఒక చెట్టుకు తగిలి పడిపోయాడు. ఆ తర్వాత ఎలాగోలా అక్కడ నుండి సక్సెస్ ఫుల్ గా బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ వీడియో చూసిన వారు బలహీనవంతుల్ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
మరి కొందరు జీవులను హింసించకండి అంటూ నీతి పాఠాలు వల్లిస్తున్నారు. ఇంకా కొంతమంది కోపంతో ఉన్న ఆ అబ్బాయికి మూగ జీవి అయిన కోడి భలే జర్క్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఎలా అయితే ఏమిటి ఈ వీడియో చూస్తుంటే పాట్లలేని నవ్వు వస్తోందంటూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి