అమ్మ తన బిడ్డను నవమాసాలు కడుపులో పెంచుకొని మోస్తే నాన్న మాత్రం ఆ బిడ్డను తన జీవితకాలం తన మెదడులో పెట్టుకొని మోస్తాడు.బిడ్డకు ఏమైన జరిగి చివరకు అనారోగ్యమని తెలిస్తే అల్లాడిపోతాడు తండ్రి. మళ్లీ మామూలు స్థితికి వచ్చే దాకా ఆ తండ్రికి అసలు తన కంటి మీద కునుకు ఉండదు. అలాంటిది తన బిడ్డకు బ్రెయిన్‌లోనే ప్రాబ్లం ఉందంటే ఆ తండ్రి అసలు తట్టుకోగలడా ?. ఎలాగైనా సరే తన బిడ్డను సాధారణ స్థితికి తేవాలని ఆ తండ్రి తన సర్వశక్తులు ఒడ్డుతాడు. ఇక ఆ తండ్రి కూడా అలాగే చేశాడు. తన బిడ్డకు బ్రెయిన్ సర్జరీ చేయించాడు. అయితే ఆ సర్జరీ చేసిన ప్రాంతం అంతా కూడా జుట్టు తీసేసి డాక్టర్లు కుట్లు వేశారు. బిడ్డకు మెలకువ వచ్చి డిశ్చార్జ్ అయ్యే టైంలో తన తలకు ఉన్న కుట్లు చూసుకుని బేలగా అయిపోకుండా ఉటుంది.ఇక అందుకే ఆ తండ్రి తన బిడ్డ కోసం విభిన్నంగా ఆలోచించాడు.అచ్చంగా బ్రెయిన్ సర్జరీ అయిన తన బిడ్డ తలకు ఎలా కుట్లు వేశారో అచ్చంగా అలాగే హెయిర్ స్టైలిస్ట్ దగ్గర కు వెళ్లి ..తన హెయిర్ స్టైలింగ్ చేయించుకున్నాడు ఆ తండ్రి.

ఇక తన బిడ్డతో పాటు తనకూ కూడా అలాగే ఉందని బాధలో వున్న తన బిడ్డకు చూపించాడు. నీకు ఏమీ కాదు చిన్నా... నీలాగే నాకు కూడా ఉంది. ఇద్దరికీ తగ్గిపోతుందని ఆ బిడ్డకు ధైర్యం కల్పించాడు. తన బిడ్డకు ధైర్యం కల్పించడానికి ఆ తండ్రి చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ తండ్రి ప్రేమ అందర్నీ కూడా స్పందించేలా చేస్తోంది. ఇక ఇది ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయింది.ఈ ఫోటో తన బిడ్డపై తండ్రికి ఎంత ప్రేమ వుందో అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక ఈ ఫోటోకి నెటిజన్స్ తండ్రి ప్రేమ వెలకట్టలేనిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైరల్ అవుతున్న ఈ ఫోటోని మీరు చూసి మీ స్పందన ఏంటో తెలియజేయండి.ఇక ఆ ఫొటోలో వున్న ఆ తండ్రి ఎవరు..? ఇంకా ఆ బిడ్డ ఎవరు? అని నెటిజన్స్ ఆరా తీయడం ఎక్కువ అయింది. ఇక వారి వివరాలు ఎప్పుడైనా సరే బయటకు రావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: