సైన్స్ రాకెట్ కన్నా ఎక్కువగా పెరిగిపొయింది.. కళ్ళకు కూడా ఔరా అనిపించేలా పెరుగుతూన్నాయి.. రోజు రోజుకు ఎంతగా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇలా సైన్స్ పెరిగినా కూడా మూఢనమ్మకాలు కూడా ఎక్కువగానె పెరుగుతూన్నాయని అందరికి తెలుసు. ఈ మూఢనమ్మకాల పిచ్చిలో వింత పూజలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చాలా మంది ఇలానే ప్రాణాలును పోగొట్టుకున్నారు.. కొన్ని రాష్ట్రల లొ మూఢ నమ్మకాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి..


ఇది ఇలా ఉండగా.. తాజాగా ఇప్పుడు మరో ఘటన వెలుగులొకి వచ్చింది.నొప్పులకు నాటువైద్యం, పాము కరిస్తే కోడితో వైద్యం చేయడం చాలా సార్లు మనం చూసే ఉంటాము.. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన హల్ చల్ చెస్తుంది.. పాము కరిస్తే సొంత వైద్యం చేశారు. దాంతో అది విఫలం కావడం తో ప్రాణాలు పోయాయి. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది..


వివరాల్లొకి వెళితే.. ఈ విచార ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌షేర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల దేవేంద్రి పాము కరించింది. కట్టెల కోసం అని వెళ్ళి పాము కాటుకు గురైంది. వెంటనే ఆమె స్థానికం గా వున్న తన ఇంటికి పరుగు పరుగున వచ్చింది. ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. అతను ఆసుపత్రికి తీసుకోని వెళ్ళకుండా పక్కనే వున్న ఆవు పేడల ను తీసుకొచ్చి అందులో ఆమెను పూడ్చిపెట్టాడు. ఆవుపేడ లో అనేక ఔషదాలు ఉంటాయని, పాముకాటు నుంచి విషాన్ని బయటకు లాగేస్తుందని చెప్పడం తో ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. అయితే అతను ఆవు పేడను మొత్తం పూయడంతో ఊపిరి ఆడకుండా ఉండటం తో ఆమె చనిపొయింది.ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమా ల్లో వైరల్ అవుతుంది. నార్త్ రాష్ట్రాలలొ మూఢనమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: