ఇక సోషల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట్లో ఎన్నో రకాల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియాలు అయితే రోజు కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక కేవలం కుక్కలు, పిల్లులు, ఏనుగుల వంటి జంతువుల వీడియోలు మాత్రమే కాదు.. రామ చిలుకలు ఇంకా నెమళ్ళు వంటి పక్షుల వీడియోలు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రంగుల రంగుల రామచిలుకలు అయితే తన ముద్దు ముద్దు మాటలతో ఇంకా ఆటల వీడియోలతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక ప్రముఖ క్రీడ.. బాస్కెట్బాల్ అనేది రెండు గ్రూప్ లు బాల్ ను రింగ్ లో వేస్తూ.. ఎంతో పోటాపోటీగా ఆడే ఆట. అయితే ఈ గేమ్ ని రామ చిలుకలు రెండు గ్రూపులుగా విడిపోయి పోటాపోటీగా ఆడుతుంటే.. ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కసారి ఊహించండి.. అందులోనూ పసుపు రంగు రామ చిలుకలు ఒక గ్రూప్ గా ఉండి ఇంకా అలాగే ఆకు పచ్చ రంగులో ఉన్న రామచిలుకలు ఒక గ్రూప్ గా ఏర్పడ్డాయి. 



ఆ కోర్టులో ఇరువైపులా కూడా బాస్కెట్ రింగ్స్ లో .. బాగా పోటీపోటీగా గోల్స్ చేస్తూ.. తెగ సందడి చేస్తున్నాయి. అందులో కూడా పసుపు రంగు రామ చిలుకలు.. ఆ కోర్టుకు ఒకవైపు గోల్స్ చేస్తే.. అలాగే ఆకు పచ్చ రంగు రామ చిలుకలు మరొక వైపు గోల్స్ చేయడం.. చాలా విచిత్రంగా అనిపిస్తుంది చూపరులకు.. ఎందుకంటే వాటికి ఎటువంటి గోల్స్ చేస్తే.. తమ అకౌంట్ లో పడతాయో తెలుసు అన్నట్లు గేమ్ ని ఓ రేంజ్ లో ఆడాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. అది లక్షలాది వ్యూస్ ను ఇంకా అలాగే వేలాది లైక్స్ ను సొంతం చేసుకుంది.రామచిలుక అంటే ఎంతో ఆకర్షణీయంగా వుండే పక్షి. దీనిని పెంపుడు జీవిగా చాలా మంది కూడా పెంచుతారు. ఇక సుమారు 350 జాతుల చిలుకలు అనేవి 85 ప్రజాతులులో ఉన్నాయి. భారతదేశంలో ఈ రామచిలుకను పెంపుడు పక్షిగానే కాకుండా భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం మనం చూడవచ్చు.జ్యోతిష్యంలో కూడా ఈ చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: