సాధారణంగా గురువు అంటే తన దగ్గర చదువుకుంటున్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సి ఉంటుంది. ఇక చెడు దారి లో వెళ్లకుండా సరైన మార్గాన్ని చూపించాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం ఏకంగా టీచర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఏకంగా తప్పతాగి స్కూలుకు వస్తూ విద్యార్థుల ముందే నానా హంగామా చేసిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తప్ప తాగి వచ్చిన ఒక ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థులతో మిస్ బిహేవ్ చేసాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్న సదరు ప్రొఫెసర్ పాటలు పాడుతూ చిందులు వేశాడు. ఈ ఘటన పంజాబ్ పటాన్ కోట్ లోని జేఎన్డియూ కళాశాలలో వెలుగులోకి వచ్చింది. ఇక ఒక ప్రొఫెసర్ మద్యం మత్తులో చిందులు వేస్తూ పాటలు పాడుతూన్న ఒక వీడియో ట్విట్టర్లో చెక్కర్లు కొడుతుంది  అని చెప్పాలి.. ఇక ఆ కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా  విధులు నిర్వహిస్తున్నాడు సదరు వ్యక్తి. తన సొంత డబ్బులతో తాగుతున్నా అని.. తనను ఎవరూ ప్రశ్నించ లేరని నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉండడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.



 అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంపై సదరు ప్రొఫెసర్ స్పందించాడు. తాను ఆ సమయంలో మద్యం తాగే లేనని కేవలం తాగినట్లు నటించాను అంటూ మాట మార్చే ప్రయత్నం చేసాడు. కావాలని తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇక ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోని వైరల్ చేశారు అంటూ ఆరోపించాడు. తన జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ మద్యం ముట్ట లేదని  తన గురించి ఎవరైనా అడిగినా చెబుతారని అంటున్నాడు.. ఏది ఏమైనప్పటికీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కళాశాల యాజమాన్యం అతనిని పోస్ట్ నుంచి తొలగించింది. కాగా  మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తమ కాలేజీలో మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రవీందర్ కుమార్ గా గుర్తించారు కళాశాల యాజమాన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: