పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియన్ రోనాల్డోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుట్బాల్ ఆటను ఆరాధించే ప్రేక్షకులు అందరూ కూడా తప్పకుండా క్రిస్టియన్ రోనాల్డోని అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక అతను ఫుట్బాల్ ఆడుతున్న సమయంలో గోల్ చేసినప్పుడు చేసే సెలబ్రేషన్స్ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక గోల్ కొట్టిన ప్రతిసారి కూడా ఒక సిగ్నేచర్ స్టెప్ చేస్తూ ఉంటాడు క్రిస్టియనో రోనాల్డో. ఇక ఆ సెలబ్రేషన్స్ కు అభిమానులు సుయ్ అనే పేరు కూడా పెట్టారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అంటే గోల్ కొట్టిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి ఆ తర్వాత వెనక్కి తిరిగి సుయ్ అని అరవడమే.  అయితే ఎంతో మంది అభిమానులు ఇక క్రిస్టియానో రోనాల్డో సిగ్నేచర్ స్టెప్ ని కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అచ్చం క్రిస్టియానో రోనాల్డో లాగా చేయకపోయినప్పటికీ ఏదో వాళ్లకు వచ్చినట్లుగా చేసి ఎంతగానో ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా ప్రయత్నించినప్పుడు సక్సెస్ అయిన పర్లేదు లేదా విఫలమైన పర్వాలేదు కానీ నవ్వుల పాలు అవ్వకూడదు.


 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం క్రిస్టియానో రోనాల్డో లాగానే ప్రయత్నించి చివరికి నవ్వుల పాలు అయ్యాడు. అంతేకాదు ఆసుపత్రి పాలు కూడా అయ్యాడు. రోనాల్డో కి వీరాభిమాని అయిన ఆ వ్యక్తి రోనాల్డో సుయ్ సెలబ్రేషన్ ను అనుకరిద్దామని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఫుట్బాల్ మైదానంలో ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి గోల్ చేశాడు. ఇక ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి క్రిస్టియానో రోనాల్డో లాగా గాల్లోకి ఎగిరి సుయ్ అని అనాలి అనుకున్నాడు. కానీ తనకు రానిది ప్రయత్నించి లేని కష్టాలను కొని తెచ్చుకున్నాడు. క్రిస్టియానో రోనాల్డో స్టైల్ ప్రయత్నించగా.. అతను లావుగా ఉండడంతో బరువంతా అతని ఎడమ కాలు పై పడింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: