అతివేగం ప్రమాదకరం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ అతివేగమే వాళ్లను గెలిపిస్తుంది. ఏకంగా ప్రాణాలను రిస్కులో పెట్టుకొని మరి వాళ్ళు వేగంగా బైక్ నడపాల్సి ఉంటుంది. ఎంత వేగంగా నడిపితే అంతలా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గెలిస్తే వారికి వచ్చే పాపులారిటీ కూడా అంత ఇంత కాదు. ఇంతకీ నేను దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. బైక్ రేసింగ్ గురించి. అద్భుతమైన ఫీచర్స్ ఉండే బైక్ ను తీసుకొని కొంతమంది రేసర్లు ఇక రేసులో పాల్గొని బైక్ నడుపుతూ ఉంటే.. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అనడంలో అతిశయోక్తి లేదు.


 అంత వేగంగా బైక్ ని ఎలా నడపగలుగుతున్నారు... నడుపుతూ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు అన్నది కూడా చూసిన కళ్ళకు నమ్మబుద్ధి కాదు. అయితే ఇలా బైక్ రేసింగ్ లో పాల్గొన్నవారు అటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడం ఏమో కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ప్రమాదాల బారిన పడుతూ తీవ్రంగా గాయాల పాలవడం చూస్తూ ఉంటాం. ఇక ఇటీవలే మోటో జిబి రైడర్ అయినా 31 పోల్ ఎస్పర్గారోకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. పోర్చుగీసు గ్రాండ్ బ్రిక్స్ లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ రేసులో పోల్ ఎస్పర్గారో బైక్ పట్టుతప్పడంతో  ఘోర ప్రమాదానికి గురయ్యాడు.



 కెటిఎమ్ బైకుతో రేసులో పాల్గొన్న పోల్ ఎస్పర్గారో ల్యాబ్ వన్ పూర్తి చేసి రెండో లాప్ ను మరికొన్ని సెకండ్ లలో పూర్తి చేస్తాడు అనుకుంటున్న సమయంలో పదవ నెంబర్ మలుపు వద్ద బైక్ పట్టు తప్పింది. ఇంకేముంది ఒక్కసారిగా అతను రోడ్డుపై కింద పడిపోయాడు. దీంతో వెంటనే రెడ్ ఫ్లాగ్ చూపించి రేసును నిలిపివేశారు. అయితే ఇక ఇలా కిందపడిన తర్వాత ఏకంగా బైక్ అతను మీదికి దూసుకుపోవడంతో 30 నిమిషాల పాటు అతనికి ప్రాథమిక చికిత్స నిర్వహించి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అతని ఛాతి భాగానికి దవడ భాగంలో బలంగా దెబ్బలు తగిలినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి భూమి మీద నూకలు తినే బాకీ ఉన్నట్టుంది అందుకే బ్రతికాడు అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: