
ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలలో రేషన్ కార్డులు ఉన్నవారికి కేవలం బియ్యం , పప్పులు, చక్కర మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇకపై అలా కాకుండా చిరుధాన్యాలను కూడా పంపిణీ చేయాలన్న ఆలోచన లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందడుగు వేసింది. అందులో భాగంగానే చిరుధాన్యాలను రేషన్ కార్డు పంపిణీ దారులకు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఇటీవల నంద్యాల జిల్లాలో రేషన్ కార్డుదారులకు జొన్నలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
జూన్ నుంచి సత్యసాయి, కర్నూలు, అనంతపురం జిల్లాలలో రాగులను పంపిణీ చేయబోతున్నారు. అలాగే మూడు కేజీల బియ్యం కి బదులుగా ఉచితంగా రాగులు పొందవచ్చని.. జూలై నుంచి రాయలసీమలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలా చిరుధాన్యాలను పంపిణీ చేస్తామని వెల్లడించింది. ఇకపోతే సీఎం జగన్ గుంటూరు పర్యటన ఖరారైన నేపథ్యంలో జూన్ రెండవ తేదీన ఆయన గుంటూరులో పర్యటించి వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగా మేళా నిర్వహణలో కూడా పాల్గొనబోతున్నారు.
ఈ మేళాలో భాగంగా రైతులకు 793 ట్రాక్టర్లు, 38 హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారు. ఇకపోతే ఈ వేదిక ద్వారా పల్నాడు , గుంటూరు, బాపట్ల , ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమగోదావరి , ఏలూరు , ప్రకాశం, కృష్ణాజిల్లాల రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఏది ఏమైనా ఇలా చిరుధాన్యాల పంపిణీ పై రేషన్ కార్డుదారులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.