15-24 ఏళ్లలోపు లైంగిక సంబంధం కలిగి ఉన్న అమ్మాయిల శాతం 2 -3గా ఉంటే పురుషులు 0.5 నుంచి 0.9 శాతం ఉన్నారు. ఇక 25-49 సంవత్సరాల పట్టణాల్లో నివసించే మహిళలు గ్రామీణ మహిళల కంటే రెండేళ్లు ఆలస్యంగా సెక్స్ ప్రారంభిస్తారని డేటా పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో మహిళలు 20 ఏళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు 18 సంవత్సరాలకే శృంగారంలో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. ఇక స్త్రీలలో 10 శాతం మంది 15 సంవత్సరాలకే సెక్స్ అనుభవం కలిగి ఉన్నారని గుర్తించింది. 25-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 60 శాతం మంది లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది.ఇక కొంతమంది బాలికలు తమ మొదటి సంభోగం పాఠశాల దశలోనే ప్రారంభిస్తున్నట్లు సర్వేలో తేలింది. కొంతమంది పురుషులు కూడా 12 ఏళ్లకే లైంగిక కోరికలతో డబ్బులు చెల్లించి కోరిక తీర్చుకుంటున్నారని తెలిపింది. లైంగిక సంభోగం సమయంలో 51 శాతం మంది పురుషులు కండోమ్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. ఇక అమ్మాయిల్లో ఎక్కువ శాతం అబార్షన్‌లు ప్రైవేట్ హెల్త్ సెక్టార్‌లో 53% జరిగినట్లు వెల్లడించారు. 20 శాతం పబ్లిక్ హెల్త్ సెక్టార్‌లో జరిగాయి. నాల్గవ వంతు 27% కంటే ఎక్కువ గర్భస్రావాలు స్త్రీలు స్వయంగా ఇంట్లోనే చేయించుకుంటున్నట్లు సర్వే ఆధారంగా వివరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి