హైదరాబాదులోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటన స్థలంలో ముగ్గురు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు చనిపోయారు.  చనిపోయిన మృతులలో ముగ్గురు మహిళలు,  ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలైన వారిని ఉస్మానియా డిఆర్డిఓ, హైదర్ గూడా ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇకపోతే మళ్ళీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాదులోని మీర్ చౌక్ లో గుల్జార్ హౌస్ దగ్గర ఉన్న ఒక భవనంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.  విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.  మంటల్లో చిక్కుకున్న కొంతమందిని కాపాడగలిగారు.  అయితే ఈ భవనంలో నాలుగు కుటుంబాలు చిక్కుకోగా.. ప్రమాదంలో మొత్తం ముగ్గురు చిన్నారులతో పాటు 14 మందికి గాయాలైనట్లు వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం . అయితే గాయపడిన వారిలో 9మంది మృతి చెందగా మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


భవనంలో మొత్తం 30 మంది ఉంటున్నారని స్థానికులు తెలపగా.. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు మొత్తం పది ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి.  అలాగే 10 ఆంబులెన్స్లు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది.  మంటలు భారీగా వ్యాపించడంతో చార్మినార్ కి వెళ్లే రహదారులు పూర్తిగా మూసివేశారు.  షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు  సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఏదేమైనా ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఏకంగా 9 మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: