ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలలోని మహానగరాలు కూడా రోజురోజుకి క్రమక్రమంగా కనుమరుగ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నిపుణులు  తెలుపుతున్నారు.. ఇటీవలే సింగపూర్ లోని టెక్నాలజీ యూనివర్సిటీలో ఒక అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయట. అయితే అందులో మన ఇండియాలో ఉండే ఐదు నగరాలకు కూడా పెను ప్రమాదం పొంచి ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. మరి వాటి గురించి ఇప్పుడు పూర్తిగా ఒకసారి చూద్దాం.


ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా వంటి తీర ప్రాంతాలలో 48 మహానగరాలను NTU బృందం అధ్యయనం చేసింది.. ముఖ్యంగా వాతావరణం లోని మార్పుల వల్ల సముద్రం మట్టాలు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయని దీనివల్ల మునిగిపోయే ప్రమాదం చాలా నగరాలలో కనిపిస్తున్నాయంటూ తెలుపుతున్నారు. ఐక్యరాజ్యసమితి సేకరించిన గుణాల ప్రకారం. సుమారుగా 16 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతాలలో నగరాలు మునిగిపోయే అవకాశం ఉందంటూ అంచనా వేశారు. అలా ముంపు ప్రమాదం వైపు ప్రయాణిస్తున్నటువంటి పెద్ద నగరాలలో చైనాలోని తియాంజిన్ నగరం ఉన్నదట. ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలలో 2014 - 20 వరకు ప్రతి ఏడాది కూడా 18.7 సెంటీమీటర్లు చొప్పున కుంగిపోయిందట.


ఎన్టియూ అధ్యయనం చేసిన 48 నగరాల జాబితాలలో అహ్మదాబాద్ లోని కొన్ని ప్రాంతాలు ప్రతి ఏడాది 0.01 సెంటీమీటర్ల నుంచి 5.1 సెంటీమీటర్లు మునుగుతున్నాయట.. బిబిసి అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో 51 లక్షల మంది నివాసం ఉన్నారు. అహ్మదాబాద్ లో అత్యంత వేగంగా ముంపుకు గురవుతున్నదట. ఇక్కడ టెక్ టైల్స్ కంపెనీలు ఎక్కువగా ఉండడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయట.

2). చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతాలలో 2014 నుంచి 20 వరకు సగటున 0.01 నుంచి 3.7 సెంటీమీటర్ల వరకు కుంగిపోయాయట. ఈ ప్రాంతంలో 14 లక్షల మంది నివసిస్తున్న బీబీసీ అంచనా వేశారు. ఇందులో అత్యంత మునిగిపోయే ప్రాంతం తారామణి. కారణం వ్యవసాయ పారిశ్రామిక అవసరాల కోసం భూగర్భ జలాలను ఎక్కువగా తోడేశారట.

3). కోల్కత్తాలోని కొన్ని ప్రాంతాలలో 2014- 20 వరకు ప్రతి ఏడాది సగటు 0.01c.m. నుంచి 2.8 సెంటీమీటర్లు మునిగిపోతున్నదట. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది జనాభా ఉన్నారట. ఇక్కడ భట్పారా ప్రాంతం అత్యంత వేగంగా 2.6 c.m కుంగిపోతున్నదట.


4). ముంబైలోని కొన్ని ప్రాంతాలలో 2014- 20 వరకు సగటున ప్రతి ఏడాది 0.1 c.m. నుంచి 5.9 సెంటీమీటర్ల వరకు కుంగిపోతున్నదట. ఈ ప్రాంతంలో 32 లక్షల మంది జీవిస్తున్నారు. మాతుంగ ఈస్ట్ ఏరియాలో ఉన్నది.


5). సూరత్ లోని కొన్ని ప్రాంతాలలో 2014- 20 వరకు సంఘటున 0.01 నుంచి 6.7 c.m. వరకు కుంగిపోయాయట. ఈ ప్రాంతంలో 30 లక్షల మంది జీవిస్తున్నారు. కరంజ్ అనే ప్రాంతం అత్యంత వేగంగా మునిగిపోతున్న ప్రాంతం .


ఇలా ఇండియాలో ఈ 5 ప్రాంతాలు అత్యంత వేగంగా మునిగిపోతున్న జాబితాలో ఉన్నట్లుగా సింగపూర్ టెక్నాలజీ యూనివర్సిటీ నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: