ఓ జంతు ప్రదర్శనశాలలో జరిగిన ఓ గొరిల్లా డ్రామా, తెలుగు మాస్ మసాలా సినిమాని తలపిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది ! ఒక అమ్మాయి గొరిల్లాల కేజ్ దగ్గర నిలబడి , ఆసక్తిగా వాటిని చూస్తోంది . అంతలో ఓ మగ గొరిల్లా, ఒక్కసారిగా సినిమా హీరోలా ఎంట్రీ ఇచ్చి , ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని ముద్దు పెట్టబోయింది ! అమ్మాయి కాస్త షాక్ అయినా , కూల్‌గా ఉండిపోయింది . కానీ, అసలు సీన్ అప్పుడు మొదలైంది ! ఈ రొమాంటిక్ టచ్‌ని గమనించిన ఆడ గొరిల్లా,   లేడీ సూపర్‌స్టార్ గా , ఫుల్ యాక్షన్ మోడ్ లో రంగంలోకి దిగింది. పైనుంచి రోల్ చేస్తూ , ఒక్క అగుడుతో మగ గొరిల్లాని వెనక్కి నెట్టి,  బొట్టు బొట్టు గా కొట్టడం స్టార్ట్ చేసింది . “నా ముందు వేరే అమ్మాయి ని టచ్ చేస్తావా, రా ?” అన్నట్టు ఆ ఆడ గొరిల్లా ఫైట్ సీన్ మామూలుగా లేదు !


మాస్ యాక్షన్ డ్రామాని అక్కడున్న పర్యాటకులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసేసారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే, అది క్షణాల్లో వైరల్! అయింది .. లక్షల మంది చూసి, నెటిజన్లు కామెంట్ల జాతర మొదలెట్టేసారు. “ఆడ గొరిల్లా భార్యగా ఫస్ట్ ర్యాంక్ ! భర్తకు బుద్ధి చెప్పడం అంటే ఇదే!” అని ఒకరు. “మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ ఆడవాళ్ల పై వేధింపులకు ఇలాంటి మాస్ రియాక్షన్ ఉంటది !” అని మరొకరు . పోస్ట్‌లు ఈ సీన్‌ని “భార్య గుణం” అని సరదాగా ట్రోల్ చేసాయి . ఈ గొరిల్లా జంట సీన్ , తెలుగు సినిమాల్లో వచ్చే కామిడి , యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేసింది. గొరిల్లాల సామాజిక ప్రవర్తనని ఫన్నీగా, ఎమోషనల్ గా చూపిస్తూ, ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పూయించింది . ఇది మాస్ సినిమా క్లైమాక్స్ లాంటి ఫీల్! అంటూ వీడియోను వైర‌ల్ చేస్తున్న‌రు ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: