ఇటీవ‌ల అరెస్టైన అరుణ కేసు మ‌ళ్లీ హనీ ట్రాప్ ముఠాల ప‌నితీరుపై చర్చను తెరపైకి తెచ్చింది. రాజకీయాల్లోనూ, జాతీయ భద్రతా వ్యవహారాల్లోనూ హనీ ట్రాప్స్ పెద్ద పంజా విసురుతున్నాయనే విషయాన్ని ఈ కేసు మరొకసారి బయటపెట్టింది. హనీ ట్రాప్ అంటే ఏమిటి? .. మహిళలను టార్గెట్ వ్యక్తుల దగ్గరికి పంపించి, వారిని వలలో వేసి, ఆ తర్వాత వారి ప్రైవేట్ చాట్స్, వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం. చాలా సార్లు ఇది డబ్బు దోచుకోవడానికి, ఇంకోసారి రాజకీయంగా, వ్యూహాత్మకంగా ఎవరినైనా కూలదోసేందుకు ఉపయోగిస్తారు.


అరుణ కేసు – హనీ ట్రాప్ + మనీ ట్రాప్! .. ఈ అరెస్టైన అరుణ, పోలీస్ అధికారులను కూడా టార్గెట్ చేసిందని సమాచారం. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, కొన్ని అదనపు ఎస్పీలతో జరిగిన సంభాషణలను రికార్డ్ చేసి, డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అంటే ఇక్కడ కేవలం హనీ ట్రాప్ మాత్రమే కాదు, మనీ ట్రాప్ కూడా కలిపి ఆపరేట్ అయ్యిందని దర్యాప్తులో తేలుతోంది. ఇది కొత్త కాదు.. గతంలో కూడా పెద్దలే వలలో! .. రాజకీయ రంగంలో ఇప్పటికే చాలా మంది పెద్దలు ఈ హనీ ట్రాప్‌లకు బలి అయిన ఉదాహరణలు ఉన్నాయి. గ‌త ప్ర‌భూత్వంలో పృథ్వీరాజు, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు లాంటి నేతల పేర్లు బయటకు రావడం సంచలనం రేపింది. వారి ప్రైవేట్ వీడియోలు, ఆడియోలు లీక్ అవ్వడం వల్ల రాజకీయాల్లోనే కాదు, వారి ఇమేజ్‌పైనా తీవ్ర దెబ్బ పడింది.



జాతీయ భద్రతకే ముప్పు! .. హనీ ట్రాప్‌లు కేవలం రాజకీయాల్లోనే కాదు, నేషనల్ సెక్యూరిటీ వ్యవహారాల్లో కూడా పెద్ద టూల్‌గా మారాయి. చాలా సార్లు సున్నితమైన సమాచారం ఉన్న అధికారులు, ఆర్మీకి చెందిన వ్యక్తులు కూడా టార్గెట్ అవుతుంటారు. వ్యక్తిగత బలహీనతను వాడుకుని, దేశ రహస్యాలు దోచుకునే ప్లాన్‌లకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఇంటెలిజెన్స్ సంస్థలు హనీ ట్రాప్‌లను అత్యంత ప్రమాదకర ఆయుధంగా పరిగణిస్తాయి. ప్రస్తుతం అరుణ అరెస్ట్‌తో.. ఆమె బ్యాక్‌గ్రౌండ్, ఆమె వెనక ఉన్న ముఠా, ఇంకా టార్గెట్ అయిన వాళ్లు ఎవరో అన్నది ఇప్పుడే హాట్ టాపిక్. ఇది కేవలం వ్యక్తిగత స్కాండల్ మాత్రమేనా? లేక ఒక పెద్ద నెట్‌వర్క్ ఆపరేషన్‌లో భాగమా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తం మీద రాజకీయాల్లోనూ, సెక్యూరిటీ వ్యవహారాల్లోనూ హనీ ట్రాప్ అనేది ఒక “సైలెంట్ వెపన్”. ఇది కేవలం ఒకరి కెరీర్‌ను మాత్రమే కాదు, దేశ భద్రతకే ముప్పు కలిగించే స్థాయికి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: