ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. "ఇదా మీ సృజనాత్మకత? ఒకరిని తన్నడం వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు?" అని ప్రశ్నిస్తున్నారు."ఒక్కోసారి ఇలాంటి తన్నుల వల్ల వెన్నుముక దెబ్బతిని జీవితాంతం మంచాన పడే అవకాశం ఉంది. కేవలం వ్యూస్ కోసం ప్రాణాలతో ఆడుకుంటారా?" అంటూ నెటిజన్లు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలను ప్రోత్సహించే వారిపై మరియు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరుతున్నారు.ఇటీవల కాలంలో రైల్వే ట్రాక్‌ల మీద, నడిరోడ్డు మధ్యలో, వాహనాలపై విన్యాసాలు చేస్తూ వీడియోలు తీయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. గతంలో వరంగల్ జిల్లాలో కోతుల నుంచి తప్పించుకోబోయి ఒక యువకుడు బావిలో పడ్డ ఘటన మనకు తెలిసిందే.. అది ఒక ప్రమాదం. కానీ, ఇది కావాలని చేసుకుంటున్న ప్రమాదం! ఈ మహిళ చేసిన పని వల్ల సదరు యువతికి అంతర్గత గాయాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
నిజమైన క్రియేటివిటీ అంటే పది మందికి ఉపయోగపడేలా ఉండాలి లేదా కనీసం వినోదాన్ని పంచాలి. కానీ ఇలా ఒకరిని ఒకరు హింసించుకుంటూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి 'ట్రెండింగ్' అవ్వాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈ వీడియో ద్వారా సమాజానికి ఎలాంటి మంచి సందేశం వెళ్లడం లేదని, పైగా చిన్న పిల్లలు ఇలాంటివి చూసి అనుకరించే ప్రమాదం ఉందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వ్యూస్ వస్తాయనో, ఫాలోవర్లు పెరుగుతారనో చేసే ఇలాంటి పిచ్చి పనులకు ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. ఎదుటివారిని తన్నడం లేదా హింసించడం ఎప్పటికీ 'క్రియేటివిటీ' అనిపించుకోదు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇలాంటి వీడియోలను ఎంకరేజ్ చేయకుండా రిపోర్ట్ చేయాలని పలువురు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి