ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమ ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమ పిల్లలు చదువుల్లోనూ, ఆటల్లోనూ ముందుండాలని ప్రతి తల్లిదండ్రులు ఆకాంక్షిస్తూ ఉంటారు. చిట్టిపొట్టి నడక నుండి ప్రపంచాన్ని చదివే వరకు తమ చిన్నారులు వెలుగు దివ్వెలు కావాలని తల్లిదండ్రులు నిత్యం తపన చెందుతూ ఉంటారు. అలా తమ పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడం చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతూ ఉంటారు. తమ పిల్లలు కాస్త అనారోగ్యానికి లోనైతే ఎంతో తల్లడిల్లిపోతూ ఉంటారు. అయితే కొందరు పిల్లలు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్న ఆటిజం ( మూగ వ్యాధి )  కారణంగా ఇతర పిల్లలవలే ఉండలేక పోతుంటారు.
 రెండేళ్లలోపు మాటలు నేర్చుకునే పిల్లలు ఆటిజం కారణంగా వయసు పెరుగుతున్నా మాట్లాడలేకపోతూ ఉంటారు.  తమ పిల్లల్లో ఉన్న ఈ రకమైన సమస్యను చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో భాదపడుతూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులలో ఆనందాన్ని నింపేందుకు, భావితరాలకు బాసటగా నిలిచే చిన్నారులు ఆటిజం కారణంగా ఏమాత్రం వెనక పడకూడదని ఐటీ రంగంలో ప్రపంచ ఖ్యాతి పొందిన డాక్టర్ కోటి రెడ్డి సరిపల్లి దంపతులకు వచ్చిన ఆలోచన నేడు ప్రపంచ నలుమూలల్లో ఆటిజం తో భాదపడుతున్న చిన్నారుల పాలిట వెలుగుదీవెనగా మారింది. డాక్టర్ కోటి రెడ్డి ఆయన సతీమణి శ్రీజ రెడ్డి కుటుంబంలో జన్మించిన సంహిత్ పుట్టిన్నప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే రెండేళ్ళు గడిచినా సంహిత్ ఇంకా మాట్లాడకపోవడాన్ని తల్లి శ్రీజ రెడ్డి గుర్తించింది. 
తమ కుమారుడి నోటి నుండి అమ్మ అనే పిలుపు కోసం ఆ తల్లి ఎంతగానో ఎదురు చూసింది. అయితే సంహిత్ వయసు పెరుగుతున్నా ఇంకా మాట్లాడకపోవడంతో ఇది కచ్చితంగా ఆరోగ్య సమస్యేనని గుర్తించిన శ్రీజ రెడ్డి దంపతులు ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. అయినప్పటికి తమ కుమారుడికి ఉన్న సమస్యకు సరైన పరిష్కారం లభించలేదు. అయితే పలువురు వైద్యుల ద్వారా తమ కుమారుడు ఆటిజంతో భాదపడుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ రకమైన సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదని హోమ్ థెరఫీ ఒక్కటే మార్గమని నిపుణులు చెప్పడంతో తమ కుమారుడికి హోమ్ థెరఫీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక హోమ్ థెరఫీ ద్వారా తమ కుమారుడు మాట్లాడడం, సాధారణ స్థితికి రావడంతో శ్రీజ రెడ్డి దంపతుల ఆనందానికి అవధులు లేవు.
 అయితే తమ కుమారుడి వలె ఎంతో మంది ఆటిజంతో భాదపడుతున్నారని గ్రహించిన శ్రీజ రెడ్డి .. ఆటిజం నుండి పిల్లలకు విముక్తి కల్పించేందుకు చేసిన ఆలోచన.. నేడు కోట్లాది పిల్లల పాలిట వెలుగుదీవెనగా మారింది. కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ లో 12 కంపెనీలకు అధిపతిగా ఉన్న కోటి రెడ్డి సరిపల్లి ఆయన సతీమణి శ్రీజ రెడ్డి " పినాకిల్ బ్లూమ్స్ " ను ప్రారంభించారు. ఈ " పినాకిల్ బ్లూమ్స్ "  ద్వారా ఆటిజం, వినికిడి లోపం, బుద్దిమాంద్యం వంటి సమస్యలతో భాద పడుతున్న చిన్నారులకు అత్యంత తక్కువ  ధరకే వైద్యాన్ని అందిస్తూ తల్లిదండ్రుల జీవితాలలో సంతోషాన్ని నింపుతున్నారు.



 ఇక ప్రస్తుతం " పినాకిల్ బ్లూమ్స్ " సౌత్ ఇండియాలోనే నెంబర్ ఒన్ ఆటిజం థెరఫీ నెట్వర్క్ గా గుర్తింపు పొందింది. ఇక  "పినాకిల్ బ్లూమ్స్ " సి‌ఈ‌ఓ గా ఉన్న డాక్టర్ శ్రీజ రెడ్డి సరిపల్లి గారు చేస్తున్న సేవలను ప్రపంచ స్థాయి పత్రికలలో కూడా ప్రత్యేక వ్యాసాలు రచించడం పిల్లలపట్ల ఆమె చేస్తున్న విశేషమైన సేవలకు నిదర్శనం.  నేడు "పినాకిల్ బ్లూమ్స్ " సి‌ఈ‌ఓ శ్రీజ రెడ్డి సరిపల్లి గారి జన్మదినం.. ఆమె ఇలాగే ఎంతో మంది చిన్నారులకు అండగా నిలుస్తూ భావితరాలకు బాసటగా నిలవాలని కోరుకుంటూ శ్రీజ రెడ్డి సరిపల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు.








మరింత సమాచారం తెలుసుకోండి: