అమ్మ అని ప్రేమగా సకల జనులచేత పిలవబడుతున్న మాతా అమృతానందమయి దేవి గారు.. తమ విశాలమైన ప్రేమ, ఆప్యాయత, సేవల వలన ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల జనాలకు ప్రీతిపాత్రులయ్యారు. ముఖ్యంగా, తమ వద్దకు వచ్చిన భక్తులని ఆమె ప్రేమతో లాలించి... ఆలింగనములో ఇముడ్చుకుని, దయతో ఆదరిస్తూ, కుల.. మత... జాతి.... అనే భేదాలు లేకుండా, అస్సలు ఎవరు ఎందుకు వచ్చారు అన్న విషయాలు ఆలోచించకుండా... అనంతమైన ప్రేమను వారిపై కురిపిస్తారు.

 

 

ఆమె ప్రేమ పూర్వక ఆలింగనం, చూసే వారికి అతి సాధారణంగా కనిపించినా... అది భక్తుల హృదయాలను వికసింపజేస్తూ.. లెక్కలేనంత మంది వ్యక్తుల జీవితాలలో పరివర్తనను తీసుకు వస్తుంది. గత 36 సంవత్సరాలలో మనం చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మందికి పైనే.. అమ్మ ఆలింగనంలో పరవశులైనారు. జగత్తు సుభిక్షం కోసం.. ఆమె నిరంతరం... అలుపెరుగని సేవ చేస్తోంది. అనేకమైన దాతృత్వ కార్యక్రమాలు ఆమె సంస్థల ద్వారా ప్రపంచానికి చేర వేస్తోంది. ఆమె నిస్వార్థసేవలో లభించే శాంతిసౌందర్యాలను ఎందరో అభాగ్యులు వినియోగించుకొని జన్మ చరితార్థం చేసుకుంటున్నారు. ఇక ఆమె సందేశం మనం గమనించినట్లయితే, సచేతన మరియు అచేతన వస్తువులన్నింటిలో పరమాత్మతత్త్వం ఉన్నదన్నది ఆమె  ఉపదేశం. 

 

 


అంతేకాకుండా... అమ్మ ఉపదేశాలు విశ్వజనీయమైనవి. అమ్మ మతం గురించి.. మాట్లాడినప్పుడల్లా, సర్వ మతాల ప్రేమను ఒక తాటి మీదకు తీసుకు వస్తారు. అమ్మ ఎవ్వరినీ భగవంతుని నమ్మమని బలవంతంగా చెప్పరు. ఆ తత్త్వం వారిలోనే కలదనే విషయాన్ని గుర్తు చేస్తారు. అంతేకాక, మతం మార్చుకోమని కూడా చెప్పరు. వారు కేవలం తమ తమ నిజతత్త్వాన్ని గురించి తెలుసుకుని ఆ తత్త్వాన్ని విశ్వసించమని సూచిస్తారు... అవును.. ఆమె ప్రేమ అనంత సాగరం.. ఆమె ఆలింగనంలో జగతి పరవశిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: