కానీ అనుకున్న వెంటనే అందరికీ గవర్నమెంట్ జాబు వచ్చేయదు. ఒకసారి విఫలమైతే ఇక మీరు ఎన్నటికీ అనుకున్న జాబ్ ను పొందలేరు అని కాదు. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు దాన్ని అభ్యాసంగా మరియు మీ ఓటమికి ఒక మెట్టుగా పరిగణించాలి. తదుపరి ప్రయత్నంలో అలంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. మీ గమ్యం చేరేవరకు పట్టుదలను విడువకూడదు. ఫెయిల్యూర్ ను కూడా ఒక అనుభవంగా తీసుకుని ముందుకు సాగాలి. మన అపజయాన్ని కూడా సంతోషంగా స్వీకరించి విజయం కోసం పట్టుదలగా ముందుకు నడవాలి. కొన్నిసార్లు ఎంతగా ప్రయత్నించినా మళ్లీ మళ్లీ విఫలం అవుతుండవచ్చు అలాగని నిరాశ చెందకూడదు, అక్కడితో ఆగిపోకూడదు.
మనం గెలవడం అసాధ్యమని వెను తిరగకూడదు. మన మీద మనకు విశ్వాసం ఉండాలి. అదే నమ్మకంతో మళ్లీ ప్రయత్నించండి మొదలు పెట్టాలి. మీరు చేసే ప్రయత్నం మిమ్మల్ని మీ గమ్యం వైపు నడిపిస్తుంది, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. దీనికి సాలీడు జీవితమే ఒక నిదర్శనం. గూడును ఏర్పాటు చేసుకునే సమయంలో ఎన్నిసార్లు విఫలమైనా తిరిగి రెట్టింపు విశ్వాసంతో మళ్లీ ప్రయత్నించి చివరికి తన గూడును ఏర్పాటు చేసుకుంటుంది. అదే విధంగా మనం కూడా విజయం అందుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అపజయాన్ని చూసి భయపడకూడదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి