అలా ఇతరుల కోసం మన ఆనందాన్ని దూరం చేసుకోవాల్సిన పని లేదు. అదే విధంగా మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి జీవితంలో చెడ్డ వారిమే. ఎన్ని మంచి పనులు చేసినా అవి వారికి నచ్చకపోతే అవన్నీ వారి దృష్టిలో చెడ్డ పనులే.. కావున ఇతరులకు నచ్చినట్లుగా బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టుగా మనం బ్రతకడం మంచిది. అదే మనకు సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి సమాజానికంటూ కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. వాటికి భంగం కలిగించకుండా మన జీవన విధానం, మన ఆలోచనలు ఉండేలా చూసుకోవాలి.
అలాగే మన తల్లితండ్రులు, మన మంచి కోరుకునే సన్నిహితుల సలహాలను తీసుకోవాలి. ఒకవేళ వాటికి మీరు కన్విన్స్ కాకపోతే సున్నితంగా తిరస్కరిస్తూ నచ్చ చెప్పాలి. ఇక మరో విషయం ఏమిటంటే మన ప్రతి అభిప్రాయం, నిర్ణయం మనకు ఉపయోగపడేలా ఉండాలి...మంచి చేయగలగాలి. ఇలా ప్రతి విషయంలో మనకు సంబంధించిన దానిని మనమే నిర్ణయించుకోవాలి. మరియు తిఆరుల కోసం మన అభిప్రాయాలను మార్చుకోకూడదు. మనకు నచ్చింది చేస్తే అందులో గెలుపయినా ఓటమై అయినా మనమే సంతోషంగా స్వీకరించగలము. లేదా వేరో వారి ఆలోచనను మనము ఆచరించి అందులో ఫెయిల్ అయితే ఆ బాధను వర్ణించడం కష్టం . కాబట్టి మీ భావాలకు ఎక్కువ విలువ ఇవ్వండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి