ఉమ్మడి కుటుంబం అనేది ఒకప్పుడు ఈ విధంగా ఉండేదో... ఎంత సంతోషంగా గడిపే కా ఇప్పట్లో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ పేరు చాలా మందికి పెద్దగా పరిచయం లేని పదం అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పట్లో అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ఒక కుటుంబంలోని అన్నదమ్ములు పెళ్ళిళ్ళు అయినా కూడా వారి పిల్లలతో పాటు కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. తోడికోడళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సర్దుకుని పోయేవారు. అలా కుటుంబ సభ్యులంతా కలిసి జీవించడం అంటే చిన్న విషయమేమీ కాదు. అది కూడా ఒక గొప్ప విజయమే అవుతుంది. కుటుంబం అంటే అంతా కలిసి ఉంటేనే దానికి అర్దం ఉంటుంది.

కానీ ఇప్పట్లో ఉమ్మడి కుటుంబాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి అయింది అంటే వేరు కాపురాలు పెట్టేవారి సంఖ్య ఎక్కువే. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కొందరు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం అక్కడే సెటిల్ అవ్వడం, ఇంకొందరు అత్తా మామలతో కలిసి ఉండలేక, మరికొందరు ఇంకేదో కారణాల వలన ఇలా చాలా వరకు స్మాల్ ఫ్యామిలీలే ఉన్నాయి. ఒక రకంగా  ప్రజలు ఈ పద్ధతికి లేదా ట్రెండ్ కి  అలవాటు పడిపోయారు అనే చెప్పాలి. కానీ దీని వలన జనాలలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పలుచబడుతున్నాయనే చెప్పాలి. ఇది మానవ సంబంధాల విలువను తగ్గించేలా చేస్తుందని కొందరి మేదావుల అభిప్రాయం. కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు.

కానీ ఇప్పటి జనరేషన్ లో ఇది అంత సింపుల్ కాకపోవచ్చు అంతమంది కుటుంబ సభ్యులు ఒకేచోట ఒకే ఇంట్లో కలిసి ఉండాలి అంటే చాలా సమస్యలు ఉన్నాయి. అయితే దూరంగా ఉన్నప్పటికీ తరచూ కలవడం ఒకరి కష్ట సుఖాలను ఒకరు పంచుకోవడం. సంతోషంగా వీలైనంత సమయాన్ని గడపడం వంటివి చేయాలి. పిల్లల్లో వీరు మనవారు మన సొంత వారు అన్న భావాలను పెంపొందించాలి వారికి అదో దైర్యం. కాబట్టి మీరు మీ ఉమ్మడి కుటుంబం నుండి వేరు అయి ఉంటే వెంటనే కలవడానికి ప్రయత్నం చేయండి అదే మీకు అసలైన విజయం.

మరింత సమాచారం తెలుసుకోండి: