తనపై హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత దిశ ఆత్మ శాంతించిందా ? హత్యాచారానికి గురైన దిశ తల్లి, దండ్రులు చెబుతున్న దాన్ని బట్టి అలాగే అనుకోవాలి.  వారం క్రితం శంషాబాద్ మండలంలోని చటాన్ పల్లి ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు నిందితులు హత్యాచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఘోర ఘటన వెలుగు చూసినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్త పరిస్దితిలు మొదలైందో అందరూ చూస్తున్నదే. నలుగురు నిందితులను తమకు అప్పగించాలంటూ జనాలు పోలీసుస్టేషన్ తో పాటు చర్లపల్లి జైలును చుట్టిముట్టారు. ఓ కేసు విషయంలో నిందితులను అప్పగించాలంటూ జనాలు ఈ స్ధాయిలో వాయిలెంట్ గా రెస్పాండవటం గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదు.

 

అలాంటిది ఘటన జరిగి, నిందితులను పట్టుకుని వారం రోజులైనా వాళ్ళని విచారణ పేరుతో పోలీసు స్టేషన్,  కోర్టు, జైలు మధ్య తిప్పుతిండుటంతో జనాల్లో ఆగ్రహం రోజు రోజుకు పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే  శుక్రవారం తెల్లవారుజామున  ఎన్ కౌంటర్ జరిగిందని తెలియగానే యావత్ దేశం సంతోషంగా ఊగిపోతోంది. ఇందులో భాగంగానే దిశ తల్లి, దండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు పెదకర్మ ప్రారంభమయ్యే రోజే నిందుతులు నలుగురు ఎన్ కౌంటర్ అవ్వటంతో తమ కూతురు ఆత్మ శాంతించిందన్నారు. 

 

జరిగిన ఘటనలో తమ కూతురు చనిపోయినా ఇపుడు నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ చేయటం తమకు సంతోషంగా ఉందన్నారు. తమ కూతురు ఆత్మ శాంతిస్తుందని స్వయంగా తల్లి, దండ్రులే మీడియాతో చెప్పటం అందరి గుండెలను పిండేస్తోంది.

 

హత్యాచారం కేసులో ఇన్ని రోజులు పోలసులపై మండిపడిన జనాలే ఇపుడు అదే పోలీసులపై పూలవర్షం కురిపిస్తున్నారు. దిశను ఎక్కడైతే నిందితులు కాల్చి బూడిద చేశారో అక్కడే ఆ నలుగురు ఎన్ కౌంటర్ అవ్వటంతో జనాలంతా అభినందనలు తెలుపుతున్నారు. అందుకనే పోలీసు అధికారులపై బ్రిడ్జి పైకి ఎక్కి పూలవర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయమై పోలీసు అధికారులు మాట్లాడుతూ కోపం వస్తే రాళ్ళు వేయటం, సంతోషం వస్తే పూలవర్షం కురిపించటం జనాలకు మామూలే అంటూ పోలీసు ఉన్నతాధికారులు చెప్పటం గమనార్హం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: