మటన్ చాఫ్స్ కావలసిన పదార్థాలు: మటన్ - 1 కేజి
ఉల్లిపాయలు - 100 గ్రాములు
టొమోటోలు - 100 గ్రాములు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 4 టేబుల్ స్పూన్
కారం - 4 tsp
ధనియాలపొడి - 5 టేబుల్ స్పూన్
పసుపు - 1/2 tsp
నూనె - కావలసినంత
గరంమసాలా - 2 టేబుల్ స్పూన్
కోడిగుడ్లు - 4
కొత్తిమీర - 1/2 కప్
ఉప్పు - రుచికి సరిపడా తయారు చేయు విధానం:
ఉల్లిపాయలు, టొమాటోల్ని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. కోడిగుడ్లన్నీ పగలగొట్టి సొనను ఓ పాత్రలోకి వంపాలి. అందులో పసుపు, తరిగిన కొత్తిమీర వేసి సొనను బాగా గిల కొట్టాలి. పాన్ లో నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తరువాత కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో ముక్కలు కూడా వేసి బాగా ఉడికించాలి.
ఇప్పుడు మటన్ ముక్కలు, ఉప్పు వేసి అవి కాస్త ఉడికాక, కొద్దిగా నీళ్లు చిలకరించి అవి ఆవిరైపోయే వరకూ ఉడికించాలి. చివరగా ఉడికించిన మటన్ ముక్కల్ని గిలకొట్టిన సొనలో ముంచి నూనెలో పకోడీల మాదిరిగా వేయించాలి. అంతే కారైక్కుడి మటన్ చాప్స్ రెడీ.
మరింత సమాచారం తెలుసుకోండి: