చికెన్ బిర్యానీ తిన్నారు.. చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారు.. మరి చికెన్ రైస్ ఎప్పుడైనా తిన్నారా? అసలు చికెన్ రైస్ రుచి ఏంటో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అలాంటి ఈ చికెన్ రైస్ ని ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి ఇంట్లో చేసి పెట్టండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

అన్నం - ఒకటిన్నర కప్పు, 

 

ఉడికించిన చికెన్‌ - ముప్పావు కప్పు, 

 

ఉల్లిపాయ - ఒకటి, 

 

వెల్లుల్లి - రెండు రెబ్బలు, 

 

పొడుగ్గా తరిగిన క్యారెట్‌ - అరకప్పు, 

 

ఉడికించిన పచ్చిబఠాణీ - పావుకప్పు, 

 

వెన్న - టేబుల్‌స్పూను, 

 

కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, 

 

నూనె - టేబుల్‌స్పూను, 

 

ఉప్పు - తగినంత, 

 

మిరియాలపొడి - చెంచా.

 

తయారీ విధానం..  

 

పాన్ ను స్టవ్ మీద పెట్టి నూనె వేసి అది కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలూ, దంచిన వెల్లుల్లి వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక క్యారెట్‌ తరుగూ, ఉడికించిన పచ్చి బఠాణీ వేసి బాగా వేయించాలి. క్యారెట్‌ పచ్చివాసన పోయాక చికెన్‌ ముక్కలూ తగినంత ఉప్పూ, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇది కూరలా తయారయ్యాక అన్నం, వెన్నా, కొత్తిమీర తరుగూ వేసి బాగా కలిపి ఐదు నిముషాలు అయ్యాక దింపేయాలి. అంతే చికెన్ రైస్ రెడీ అయిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: