మిథాలి రాజ్... క్రికెట్ గురించి కాస్త పరిచయం ఉన్నా సరే ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. భారత క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో గంగూలీ, సెహ్వాగ్ తో పాటుగా అడుగు పెట్టింది. ఇప్పుడు టీం ఇండియా పురుషుల ఉన్న వాళ్ళు చాలా మంది అప్పుడు కనీసం పుట్టలేదు. కోహ్లి అయితే బ్యాట్ కూడా పట్టుకోలేదు. అందుకే మహిళల క్రికెట్ లో ఆమెను సచిన్ తో పోలుస్తూ ఉంటారు. 

 

భారత్ లో మహిళల క్రికెట్ కి ఏ మాత్రం ఆదరణ లేని రోజు నుంచి నేడు మహిళల క్రికెట్ ని ఆదరించే స్థాయి వరకు ఆమె చేరుకుంది. ప్రకటనలు ఉండేవి కాదు, మైదానానికి అభిమానులు వచ్చే వాళ్ళు కాదు, ఆదాయం ఉండేది కాదు కాబట్టి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా వాళ్ళను పెద్దగా పట్టించుకునేది కాదు. ఎందరో మహిళా క్రికెటర్లు ఆమెతో పాటుగానే జట్టులోకి వచ్చి వెళ్ళిపోయారు. క్రికెట్ అవసరం లేదని పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు.

 

ఇప్పుడు ఆమె టి20 ఫార్మాట్ నుంచి తప్పుకుని పరిమిత ఓవర్ల క్రికెట్ లో కీలకమైన వన్డే సీరీస్ మాత్రమే ఆడుతుంది. టీం ఇండియా ని విశ్వ విజేతగా నిలిపింది. క్రికెట్ లో ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నేడు మహిళల క్రికెట్ లో ఆమె ప్రేరణ తోనే చాలా మంది అడుగు పెట్టారు. ఆమె చాలా మందిని ముందుకి నడిపించింది. ఆమె క్రికెట్ లోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు దాటిపోయింది. అందుకే క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకునే పేరు మిథాలి రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: