ఒకప్పుడు బిచ్చగత్తె.. ప్రస్తుతం హీరోయిన్..ఎలా జరిగింది. బిచ్చమెత్తుకునే 13 ఏళ్ల అమ్మాయి జీవితంలో అంత మార్పు ఎలా వచ్చింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయ్యింది. అందరూ దీని కోసమే సెర్చ్ చేస్తున్నారు. ఎవరా అమ్మాయి.. ఏమిటా కథ అని అందరూ ఆసక్తిగా వెదుకుతున్నారు.

ఆ ఒక్క ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసింది. రాత్రి రాత్రే మోడల్ అయ్యింది. తన జీవిత చక్రాన్ని మార్చేసింది. సత్తుపళ్లెంతో బిచ్చమెత్తుకునే స్థితి నుంచి వెండి కంచాల్లో తినే స్థితికి చేరుకుంది. ఫిలిప్పీన్స్ కి చెందిన బిచ్చగత్తెని ఒకరు ఫోటో తీయడం వల్ల ఇదంతా జరిగింది.  ఆమె పేరు రీటా. ఆమెది నిరుపేద కుటుంబం. ఆమెకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారి జీవితం చాలా దుర్భరంగా సాగేది. అందుకే కుటుంబ పోషణ కోసం రీటా బిచ్చమెత్తుకునేది.

ఒకసారి ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఫిలిప్పీన్స్ వచ్చాడు. అక్కడ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమాన్ని చూడటానికి అతను రెడీ అయ్యాడు. అతనికి బిచ్చమెత్తుకుంటున్న రీటా కనిపించింది. ఆమె ఫోటో తీసి న్యాచురల్ బ్యూటీ అంటూ క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అంతే.. ఆ ఫోటో కొద్ది సమయంలోనే వైరల్ అయ్యింది. లక్షల లైకులు,, వేల కామెంట్లు వచ్చాయి.


ఆ ఫోటోగ్రాఫర్ ఆ అమ్మాయిని కలిసి వివరాలు సేకరించాడు. ఆమె జీవితాన్ని మలుపు తిప్పాడు. సోషల్ మీడియాలో రీటా ఫేమస్ అవ్వడంతో  మోడల్ గా ఆఫర్లు వచ్చాయి. తర్వాత సీరియల్స్ నూ నటించింది. హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేసింది. పలు ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఫుల్ బిజీ అయ్యింది.


2013లో ఫోటోగ్రాఫర్ రీటా ఫోటో తీశాడు. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు. ఒక్క ఫోటో రీటా జీవితాన్ని బిచ్చగత్తె నుంచి హీరోయిన్ ని చేసింది. ప్రస్తుతం ఆమె కష్టాలు తీరిపోయాయి. ఆర్థిక స్థితి మెరుగుపడటంతో కుటుంబాన్ని బాగా చూసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: