మొటిమలను తగ్గించడంలో నిమ్మకాయ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.ఎందుకంటే ఈ నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనెని మిక్స్ చేసి మొటిమలపై అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల ఖచ్చితంగా చక్కటి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే టీ ట్రీ ఆయిల్ కూడా మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలను తొలగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా అలాగే యాంటీమైక్రోబయల్ లక్షణాలు వున్నాయి. అన్ని రకాల చర్మ వ్యాధులను నివారించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడు, నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్, కొబ్బరి/బాదాం నూనెలను మిక్స్ చేయాలి. ఆ తరువాత ఆ పేస్ట్‌ని మీ ముఖానికి బాగా అప్లై చేయాలి.ఇలా అప్లై చేసిన తరువాత ఒక రెండు గంటల పాటు అలాగే ఉండనివ్వాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకోని ఉదయం మంచినీటితో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ప్రతీ రోజూ ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.


అలాగే కలబంద అనేది మానవ జాతికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన కలబంద.. మొటిమల మచ్చలు ఇంకా ఇన్ఫెక్షన్లను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. తాజా కలబంద ఆకుల నుండి వచ్చే జెల్‌ను ముఖం ఇంకా మెడపై అప్లై చేయాలి. ఇక రాత్రి సమయంలో అప్లై చేసుకుని.. ఉదయం పూట శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలు ఇంకా మచ్చలను చాలా సులభంగా తొలగిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి కారణమవుతుంది. 1 స్పూన్ నారింజ తొక్క పొడి, 1 స్పూన్ ముడి తేనె తీసుకుని వాటిని బాగా మిక్స్ చేయాలి.ఇలా పేస్ట్‌లా తయారు చేసుకున్న ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ అలాగే ప్రభావిత ప్రాంతాలపై అప్లై చేయాలి.అలా ఒక 10 - 15 నిమిషాల పాటు ఉంచుకుని.. ఆ తరువాత మంచినీటితో శుభ్రపరుచుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: