
రవితేజ , కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మొదటగా వీర అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ లో రవితేజ , కాజల్ కెమిస్ట్రీ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో కాజల్ తన నటనతో అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబో లో సారొచ్చారు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన ఈ మూవీ లో రవితేజ , కాజల్ జంటకు ఆ సమయంలో మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. అలా రవితేజ , కాజల్ కాంబోలో వీర , సారొచ్చారు అనే రెండు సినిమాలు రాగా ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి.