బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల పుట్టిన రోజు నేడు. ఈ వేడుకను తన ప్రియుడు, నటుడు విష్ణు విశాల్​తో కలిసి హైదరాబాద్​లో జరుపుకొంది. జ్వాలను ఆశ్చర్యపరిచేందుకు విష్ణు హైదరాబాద్​ వెళ్లి.. ఆమెకు ఎంగేజ్​మెంట్​ రింగ్​తో ప్రపోజ్​ చేశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను, నిశ్చితార్థపు ఉంగరాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు.


రెండేళ్లుగా విష్ణు, జ్వాల ప్రేమలో ఉన్నారు. తరచూ ఈ జంట తమ ఫొటోలు, వీడియోలను సోషల్​ మీడియాలో అభిమానులతో షేర్​ చేసుకుంటుంది. నిశ్చితార్థం అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు.. "జ్వాల పుట్టిన రోజును ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నా. అలా ఆమెను ఆశ్చర్యపరిచేలా ఎంగేజ్​మెంట్​ రింగ్​తో ప్రపోజ్​ చేశా. అదృష్టం కొద్దీ అవును అని చెప్పి నన్నే ఆశ్చర్యపరిచింది." అని పేర్కొన్నాడు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత.. ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: